తెలంగాణ

telangana

ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి : 'కల్కి' సీన్స్​పై అమితాబ్‌

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 12:48 PM IST

source ETV Bharat
Prabhas Amitabh (source ETV Bharat)

Kalki 2898 AD Prabhas Amitabh : ప్రభాస్-నాగ్అశ్విన్‌ కాంబో కల్కి 2898 ఏడీలో కొన్ని సీన్స్​పై వస్తోన్న విమర్శలకు అమితాబ్ స్పందించారు. ఏ సీన్​ అయినా ప్రేక్షకులను మెప్పించడం కోసమేనన్నారు. "ప్రభాస్‌ ఇంట్రడక్షన్ నిడివి ఎక్కువ ఉందని, కథలోకి వెళ్తే బాగుండేదని కొందరు అంటున్నారు. ఆ సీన్​ను కేవలం ఇంట్రడక్షన్‌ సీన్‌లా కాకుండా ఒక తెలుగు హీరో ఇంట్రడక్షన్ సీన్​లాగా చూడాలి. కోట్ల మంది ఫ్యాన్స్​ ప్రభాస్‌ను దేవుడిలా చూస్తారు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి" అని అన్నారు. దీనికి నాగ్‌అశ్విన్‌ బదులిస్తూ "అభిమానుల కోసమే ఇందులో ఓ డైలాగ్ ఉంది. 'నాకు ఫ్యాన్స్ ఉన్నార'ని భైరవ అనగా - 'రెబల్ ఫ్యాన్స్' అని బుజ్జి తిరిగి అంటుంది. దీన్ని చూసి ఫ్యాన్స్ చాలా ఎంజయ్‌ చేసుంటారు. హ్యాపీ ఫీల్ అయి ఉంటారు" అని అన్నారు. కాగా, కల్కి ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది.

ABOUT THE AUTHOR

...view details