ETV Bharat / spiritual

గురుదోషంతో ఉద్యోగంలో సమస్యలా? ఈ పూజ చేస్తే సక్సెస్ మీ వెంటే! - Guru Dosha Nivaran Puja - GURU DOSHA NIVARAN PUJA

Guru Dosha Remedies In Telugu : ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానానికి ఎదగాలన్నా, ఉద్యోగంలో అత్యున్నత పదవులు పొందాలన్నా జాతకంలో గురు స్థానం బలంగా ఉండాలి. గురువు కళ్యాణకారకుడు. గురువు నీచంగా ఉంటే ఎన్ని సంబంధాలు చూసినా పెళ్లి నిశ్చయం కావడం కష్టమవుతుంది. జాతకంలో గురు స్థానం బలం కోసం ఏ దేవుని పూజించాలి? ఎలా పూజించాలి అనే విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

Guru Dosha Nivaran Puja
Guru Dosha Nivaran Puja (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 19, 2024, 4:04 AM IST

Guru Dosha Remedies In Telugu : వరాహ మిహిరుడు రచించిన జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి జీవితంలో ఉన్నత స్థానానికి చేరాలంటే జాతకం ప్రకారం గురు గ్రహం బలంగా ఉండడం అవసరం. జాతకంలో గురువు నీచంగా ఉంటే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో సమస్యలు ఆటంకాలు ఏర్పడతాయి. అలాగే బృహస్పతి కళ్యాణకారకుడు. జాతకంలో గురు స్థానం బలంగా ఉంటేనే కళ్యాణ యోగం ప్రాప్తిస్తుంది. అందుకే ఎప్పటికప్పుడు జాతకంలో గురు స్థానం ఎలా ఉందో చూసుకొని ఒకవేళ బలహీనంగా ఉంటే దానికి తగిన పరిహారాలు చేసుకోవడం ద్వారా బృహస్పతి అనుగ్రహాన్ని పొందవచ్చునని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు.

గురుదోషాలను పోగొట్టే శ్రీహరి పూజ
హిందూ సనాతన ధర్మం ప్రకారం గురువారం శ్రీహరి పూజకు విశిష్టమైనది. విష్ణువును ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం. గురుగ్రహ అనుకూలత కోసం గురువారం కొన్ని పొరపాట్లు చేయకుండా ఉండాలని శాస్త్రం చెబుతోంది. అవేమిటో చూద్దాం.

గురువారం నియమ నిష్టలతో విష్ణువును పూజిస్తే ఇటు విష్ణువు అనుగ్రహంతో దేవ గురువు బృహస్పతిని కూడా ప్రసన్నం చేసుకోవచ్చు. హిందూ మత విశ్వాసం ప్రకారం అరటి చెట్టు బృహస్పతికి నెలవు. అదే పురాణాల ప్రకారం అయితే అరటిచెట్టు విష్ణువుకు ఆవాసం. అందుకే గురువారం అరటి చెట్టును పూజించే ఆచారముంది. గురువారం మహావిష్ణువుకు నైవేద్యంగా సమర్పించే పండ్లలో అరటిపండ్లును తప్పని సరిగా చేర్చాలి. అయితే గురురువారం పొరపాటున కూడా అరటిపండ్లు తినరాదు. అలా చేస్తే గురుదోషం ఏర్పడుతుంది.

గురువారం రోజున గోళ్లు కత్తిరించుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, క్షవరం చేసుకోవడం అశుభం. పొరపాటుగా అయినా గురువారం రోజున ఈ పనులన్నీ చేస్తే జాతకంలో బృహస్పతి స్థానం క్షీణించి ధన సంపాదన ఆగిపోయి పనిలో ఆటంకాలు ఏర్పడతాయని విశ్వాసం.

గురువారం ఇలా చేస్తే శ్రీహరి అనుగ్రహం

  • గురువారం అరటిచెట్టును శ్రీహరి, దేవ గురువు బృహస్పతి స్వరూపంగా భావించి పసుపు కుంకుమలతో పూజించాలి.
  • గురువారం రోజు విష్ణుమూర్తిని పసుపురంగు పూలతో పూజించాలి. శెనగపప్పుతో చేసిన పదార్ధాలు, పసుపు రంగులో ఉండే ప్రసాదాలు నివేదించాలి. ఈ రోజు పప్పు ధాన్యాలు దానం చేయడం వలన శ్రీహరి అనుగ్రహంతో పాటు బృహస్పతి అనుగ్రహం కూడా లభిస్తుంది.
  • గురువారం గోమాతకు నానబెట్టిన శెనగలు తినిపిస్తే గురుగ్రహ దోషం తొలగిపోతుంది.
  • గురువారం పసుపు రంగులో ఉండే వస్త్రాలు, ప్రసాదాలు దానం చేయడం వలన జాతకంలో ఉన్న గురుదోషం పోయి, బృహస్పతి అనుగ్రహంతో విజయం ప్రాప్తిస్తుంది.
  • అలాగే గురువారం విష్ణు సహస్రనామం పారాయణ చేయడం కూడా శుభప్రదం. శాస్త్రంలో చెప్పిన విధంగా గురువారం ఈ నియమాలను పాటిస్తే జాతకంలో ఉన్న గురు దోషాలు పోయి సకల విజయాలు చేకూరుతాయి. శుభం భూయాత్!

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.