ETV Bharat / state

ఆ 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వండి : హైకోర్టు - HC on Merger of Gram Panchayats

Telangana High Court Notice to Govt : ఓఆర్​ఆర్​ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడం వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఇందుకు సంబంధించిన నోటీసులను జారీ చేసింది. మరోవైపు హైడ్రాకు కూడా నోటీసులు జారీ చేసింది.

High Court on Merger of Gram Panchayats in Telangana
High Court on Merger of Gram Panchayats in Telangana (ETV Bharat)
author img

By ETV Bharat Telangana Team

Published : Sep 18, 2024, 10:16 PM IST

High Court on Merger of Gram Panchayats in Telangana : శంషాబాద్ మండలంలో 51 గ్రామ పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో 4 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలంటూ పురపాలకశాఖ, సాధారణ పరిపాలన శాఖ ముఖ్యకార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శి, జీహెచ్ఎంసీ కమిషనర్లకు నోటీసులు జారీ చేసింది. శంషాబాద్ మండలంలోని 51 పంచాయతీలను శంషాబాద్ మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ ను సవాలు చేస్తూ మాజీ సర్పంచి పద్మావతి, మరో నలుగురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ జె శ్రీనివాసరావులతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది.

చిన్న గోల్కొండ, పెద్దగోల్కొండ, బహదూర్‌గూడ, హమీదుల్లానగర్, రషీద్‌గూడ తదితర గ్రామాల ప్రజలు విలీనాన్ని వ్యతిరేకిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది సంజన కోర్టుకు తెలిపారు. పట్టణీకరణతో సహజ జీవనానికి ఇబ్బందులు ఎదురవుతాయని, జీవన వ్యయం పెరిగిపోతుందన్నారు. పట్టణీకరణ పేరుతో గ్రామీణ వాతావరణం దెబ్బతింటుందని, పన్నుల పెంపు ఉంటుందన్నారు. పంచాయతీ సర్పంచులు సొంత నిధులతో పంచాయతీలను అభివృద్ధి చేశారని, విలీనం జరిగితే వాటిని ప్రభుత్వం రాబట్టుకోవడం కష్టమన్నారు. వాదనలను విన్న ధర్మాసనం కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను 4 వారాలకు వాయిదా వేసింది.

మేడ్చల్​ మల్కాజిగిరిలో హైడ్రాకు హైకోర్టు నోటీసులు : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేటలో ఎర్రకుంట ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టారంటూ మ్యాప్స్ ఇన్‌ఫ్రా పై నమోదు చేసిన క్రిమినల్ కేసుకు సంబంధించి వివరణ ఇవ్వాలంటూ హైడ్రాకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆక్రమణలపై నీటిపారుదల శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసు స్టేషన్‌లో నమోదైన కేసును కొట్టివేయాలంటూ మ్యాప్స్ ఇన్‌ఫ్రా తరఫున మేనేజింగ్ ఫార్టనర్ సుధాకర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై జస్టిస్ కె.సుజన విచారణ చేపట్టారు. తాము కొనుగోలు చేసిన భూమిలోనే నిర్మాణాలు చేపట్టామని, తప్పుడు కేసులు నమోదు చేశారని కొట్టివేయాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. వాదనలను విన్న న్యాయమూర్తి వివరణ ఇవ్వాలంటూ హైడ్రాకు, బాచుపల్లి పోలీసులకు, ఇరిగేషన్ శాఖ ఏఈఈకి నోటీసులు జారీ చేస్తూ విచారణను వాయిదా వేసింది.

సుప్రీంకోర్టు 'బుల్డోజర్ న్యాయం ఆపండి​' ఆదేశాలు 'హైడ్రా'కు వర్తించవ్ : రంగనాథ్ - HYDRA Ranganath on SC Verdict

ఓఆర్ఆర్ పరిధిలోని 51 గ్రామ పంచాయతీలను సమీపంలోని మున్సిపాలిటీల్లో విలీనం - Gram Panchayats Merge

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.