తెలంగాణ

telangana

ఆయన వల్లే ఈరోజు నేనిలా అయిపోయాను : శ్రీలీల ఎమోషనల్!

By ETV Bharat Telugu Team

Published : Aug 1, 2024, 4:00 PM IST

source ETV Bharat
Sreeleela (source ETV Bharat)

Sreeleela About his Grandfather : టాలీవుడ్‌లో వరుస సినిమాల్లో నటించి, తన గ్లామర్​, డ్యాన్స్‌తో యూత్​ను బాగా ఆకట్టుకున్న భామ శ్రీలీల. కానీ వరుస ఫ్లాపులు రావడంతో సినిమాల జోరు కాస్త తగ్గించి, ఆచితూచి కథలను ఎంచుకునే ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఇప్పటికీ ఆమే క్రేజ్​ అలానే ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో బడా హీరోల సినిమాలు ఉన్నాయి. రాబిన్‌హుడ్‌, ఉస్తాద్‌ భగత్‌సింగ్‌, రవితేజ 75 వంటి చిత్రాలు చేస్తోంది. బాలీవుడ్​లోనూ ఓ ప్రాజెక్ట్​కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే తాజాగా ఆమె ఈ స్థాయిలో ఉండటానికి గల కారణాన్ని తెలిపింది.

"మా తాతయ్య వల్లే నేను సినిమాలు చేస్తున్నాను. నటిగా రాణించగలుగుతున్నాను. మాది విద్యావంతుల ఫ్యామిలీ. మా కుటుంబంలో అంతా ఇంజినీర్స్‌, డాక్టర్సే ఎక్కువ. కానీ సినిమాల్లోకి వెళ్లేందుకు తాతయ్య బాగా ప్రోత్సహం అందించారు. ఆయన వల్లే ఇప్పుడీ స్థాయిలో ఉన్నాను" అని చెప్పుకొచ్చింది.

ABOUT THE AUTHOR

...view details