అటు ఎమోషన్, ఇటు సస్పెన్స్ - ఈటీవీ విన్లోని ఈ రెండు సినిమాలు అస్సలు మిస్ కావొద్దు
Published : Jul 29, 2024, 3:32 PM IST
ETV Win OTT Movies This Week :టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ లీడ్ రోల్లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'సత్యభామ' ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ 'ఈటీవీ విన్' వేదికగా విడుదలయ్యేందుకు సిద్దమైంది. ఆగస్టు 1 నుంచి ఈ చిత్రాన్ని మూవీ లవర్స్ కోసం అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆ సంస్థ ఇటీవలే పేర్కొంది. ఇక ఈ చిత్రంతో పాటు 'డియర్ నాన్న' అనే ఫాదర్ సెంటిమెంట్ సినిమాను కూడా ఇదే వేదికగా అందుబాటులోకి తీసుకురానుంది. ఈ చిత్రం కూడా ఆగస్టు 1 నుంచి నుంచి స్ట్రీమ్ అవ్వనుంది.