సమంత యాక్షన్ సిరీస్ - 'సిటాడెల్' రిలీజ్ డేట్ వచ్చేసిందోచ్
Published : Aug 1, 2024, 3:14 PM IST
Amazon Prime Citadel Honey Bunny Release Date : వరుణ్‌ధావన్ - సమంత కలిసి నటించిన యాక్షన్ థ్రిల్లింగ్ వెబ్ సిరీస్ సిటాడెల్(Citadel Honey Bunny). రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ చాలా రోజులుగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. అయితే ఈ సిరిస్ ఎప్పుడు వస్తుందా అని చాలా కాలం పాటు ఎదురుచూసిన సినీ ప్రియులు ఇప్పుడు దాన్ని మర్చిపోయారు. అయితే ఎట్టకేలకు ఇప్పుడీ సిరీస్ రిలీజ్ డేట్‌ను ఖరారు చేసుకుంది. నవంబరు 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. హిందీతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిసింది. ఈ సిరీస్‌లో ఇంకా సిమ్రన్, కేకే మేనన్, సోహమ్ మజుందార్ తదితరులు ఇతర కీలక పాత్రల్లో నటించారు.