బన్నీకి వరలక్ష్మి వెడ్డింగ్ ఇన్విటేషన్- స్పెషల్‌గా కాబోయే భర్తతో!
Published : Jun 21, 2024, 5:40 PM IST
Varalaxmi Sarathkumar Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను తన వివాహానికి ఆహ్వానించింది నటి వరలక్ష్మీ శరత్ కుమార్. కాబోయే భర్త నికోలాయ్ సచ్దేవ్తో కలిసి బన్ని ఇంటికెళ్లిన వరలక్ష్మీ తమ వెడ్డింగ్ కార్డ్ అందించింది. బన్నితోపాటు ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ను కూడా పెళ్లికి ఆహ్వానించింది. ఇద్దరితో ఈ జంట కాసేపు సరదాగా ముచ్చటించారు. ఈ ఫొటోలను వరలక్ష్మి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇక పలు ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులను, రాజకీయ నాయకులను వరలక్ష్మి స్వయంగా కలిసి వివాహానికి ఆహ్వానిస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే రజనీకాంత్, కమల్ హాసన్‌కు ఆహ్వానం అందించింది. కాగా, జూలై 2న వీరి వివాహం జరగనుంది.