national

ETV Bharat / snippets

గూగుల్‌ మ్యాప్స్‌కు ఓలా గుడ్​బై - ఇకపై సొంత మ్యాప్స్​తోనే నావిగేషన్​!

By ETV Bharat Telugu Team

Published : Jul 7, 2024, 9:13 AM IST

Ola in house maps
Ola exits Google Map (Etv Bharat)

Ola Exits Google Maps : ఓలా కంపెనీ గూగుల్ మ్యాప్స్​ నుంచి నిష్క్రమించింది. ఇప్పటి వరకు ఓలా తమ క్యాబ్‌/ఆటో/బైక్‌ సర్వీసుల కోసం గూగుల్ మ్యాప్స్​ వినియోగిస్తూ వచ్చింది. అయితే ఇకపై, తాము సొంతంగా సిద్ధం చేసుకున్న ఓలా మ్యాప్స్‌ను ఉపయోగించనున్నట్లు ఓలా కంపెనీ సీఈఓ భవీశ్‌ అగర్వాల్‌ తెలిపారు. యూజర్లు ఓలా యాప్‌ను అప్‌డేట్‌ చేసుకుని, తాజా సేవలను పొందొచ్చని ఆయన వివరించారు.

'గత నెలలో మైక్రోసాఫ్ట్‌ అజూర్‌ నుంచి వైదొలగిన మేము, ఇపుడు గూగుల్‌ మ్యాప్స్‌ నుంచీ నిష్క్రమించాం. ఏటా రూ.100 కోట్లను ఇందుకు ఖర్చుపెట్టేవాళ్లం. ఇపుడు మా సొంత మ్యాప్స్‌ వాడతాం. కనుక మా ఖర్చు సున్నాకు చేరుతుంది' అని అగర్వాల్‌ పేర్కొన్నారు. స్ట్రీట్‌ వ్యూ, ఇండోర్‌ ఇమేజెస్, డ్రోన్‌ మ్యాప్స్‌, త్రీడీ మ్యాప్స్ మొదలైన ఫీచర్లను త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details