ETV Bharat / snippets

గ్లోబల్ ర్యాంకింగ్స్​లో భారత్ బిజినెస్ స్కూళ్ల సత్తా- టాప్ 100లో హైదరాబాద్​కు చోటు!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2024, 8:39 PM IST

Business School Rankings
Business School Rankings (Source : ANI)

Business School Rankings : భారత్‌లోని పలు బిజినెస్‌ స్కూల్స్‌ మరోసారి ప్రపంచ స్థాయిలో సత్తాచాటాయి. క్యూఎస్‌ వరల్డ్ యూనివర్శిటీ గ్లోబల్ ర్యాంకింగ్స్‌ విడుదల చేసిన జాబితాలో భారత్‌కు చెందిన 14 ఫుల్‌ టైమ్ MBA ప్రోగ్రామ్‌లు స్థానం సంపాదించాయి. టాప్‌-100 బిజినెస్‌ స్కూళ్ల జాబితాలో భారత్‌లోని IMM- బెంగళూరు, IMM- అహ్మదాబాద్‌, IMM- కలకత్తాలతో పాటు ISB హైదరాబాద్‌ ఉన్నాయి. మూడు IMMలు ఉపాధికి సంబంధించి టాప్‌-50లో స్థానం దక్కించుకున్నాయి.

క్యూఎస్‌ గ్లోబల్‌ లిస్ట్‌లో మూడు కొత్త ఎంట్రీలతో పాటు మొత్తంగా 14 ఫుల్‌ టైమ్ MBA ప్రోగ్రామ్‌లు ఈ జాబితాలో ఉన్నాయి. అమెరికాలోని స్టాన్‌ఫోర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ వరుసగా ఐదోసారి అగ్రస్థానం దక్కించుకుంది. అంతర్జాతీయ స్థాయిలో బిజినెస్‌ కోర్సులను అందించే ప్రముఖ స్కూళ్లలో ఉపాధి అవకాశాలు, తదితర కీలక అంశాలను పరిశీలించి, విశ్లేషించి క్యూఎస్‌ వరల్డ్ యూనివర్శిటీ గ్లోబల్ ఈ జాబితాను రూపొందిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.