ETV Bharat / entertainment

హీరో ధనుశ్​పై నయనతార తీవ్ర విమర్శలు - బహిరంగ లేఖ విడుదల చేసిన లేడీ సూపర్ స్టార్ - NAYANTHARA CRITICIZES DHANUSH

హీరో ధనుశ్​ను తీవ్రంగా విమర్శించిన హీరోయిన్ నయనతార - ఎందుకంటే?

Nayanthara Criticizes Hero Dhanush
Nayanthara Criticizes Hero Dhanush (source ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Nov 16, 2024, 1:13 PM IST

Updated : Nov 16, 2024, 1:29 PM IST

Nayanthara Criticizes Hero Dhanush : కోలీవుడ్ హీరో ధనుష్‌పై స్టార్ హీరోయిన్ నయనతార తీవ్ర విమర్శలు చేసింది. తన డాక్యుమెంటరీలో నానుమ్‌ రౌడీ దాన్‌ సాంగ్స్ మ్యూజిక్ వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై నయన ఈ విమర్శలు చేశారు. ఈ మేరకు ధనుశ్​కు ఓ బహిరంగ లేఖ రాశారు. కాగా, ఈ చిత్రం ధనుశ్​కు సంబంధించిన వండర్​బార్​ ఫిల్మ్​ నిర్మించింది.

"మీ తండ్రి, గొప్ప డైరెక్టర్​ అయిన మీ సోదరుడి ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చి గొప్ప నటుడిగా ఎదిగిన మీరు దీనిని చదివి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. నాలాంటి ఎంతోమంది, మనుగడ కోసం చేసే పోరాటమే సినిమా అని మనందరికీ తెలుసు. చిత్ర పరిశ్రమలో ఎవరితో లింక్స్​ లేకుండా, సంబంధం లేకుండా నేను ఈ స్థాయికి రావడానికి ఎంతో కష్టపడ్డాను. నా వృత్తికి, మరీ ముఖ్యంగా నా అభిమానులకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను.

నా మీద రూపొందిన నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ కోసం నేను మాత్రమే కాదు నా ఫ్యాన్స్​, నా శ్రయోభిలాషులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో సవాళ్లు ఎదురైనప్పటికీ నా ఫిల్మ్​ ఫ్రెండ్స్​, మొత్తం టీమ్​ సహకారంతో దీనిని రూపొందించాం.

మీరు ఈ సినిమాతో పాటు నా భర్త, నాపై పెంచుకున్న ప్రతీకారం, మమ్మల్ని మాత్రమే కాకుండా ఈ ఫిల్మ్​ కోసం భాగమై కష్టపడిన ఇతరులను కూడా ఎంతో ఇబ్బంది పెడుతోంది. నా గురించి, నా జీవితం గురించి, సినీ జర్నీ, ప్రేమ, పెళ్లితో పాటు నాతో ఉన్న అనుబంధం ఉన్న తోటి నటీ నటులు పంచుకున్న విశేషాలతో ఈ డాక్యుమెంటరీని రూపొందించారు. కానీ నా లైఫ్​లో ఎంతో ముఖ్యమైన నానుమ్‌ రౌడీ దాన్‌ చిత్రం మాత్రం ఇందులో లేకపోవడం చాలా బాధాకరం.

ఈ చిత్రంలోని ఫొటోలు, వీడియోలు, సాంగ్స్​ ఉపయోగించుకోవడానికి, ఎన్‌వోసీ ఇవ్వమని దాదాపు రెండేళ్ల పాటు నుంచి మీతో పోరాడుతున్నాను. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ డాక్యుమెంటరీ రిలీజ్‌ దగ్గర పడుతున్న సమయంలోనూ మీ పర్మిషన్​ కోసం ఎదురుచూశాము. కానీ చివరకు మేము ఆశలు వదులుకున్నాం. మీరు సహాకారం అందించకపోవడంతో రీ ఎడిట్‌ చేశాం.

నానుమ్​ రౌడీలోని పాటలు, లిరిక్స్​ ట్రూ ఎమోషన్స్ నుంచి వచ్చినవి. మా డాక్యుమెంటరీలో ఉపయోగించుకోవడానికి అంతకన్నా బెటర్​ మ్యూజిక్​ లేదనిపించింది. కానీ మీరు ఆ పాటలు లేదా కానీ ఆ పాటలకు సంబంధించిన లిరిక్స్​ వాడుకోవడానికైనా పర్మిషన్‌ ఇవ్వకపోవడం నా హృదయాన్ని ముక్కలు చేసింది" అని నయన్ రాసుకొచ్చింది.

'అమరన్‌' - థియేటర్‌పై పెట్రోల్‌ బాంబులతో దాడి

'కంగువా 2'లో దీపికా పదుకొణె? - నిర్మాత సమాధానమిదే

Last Updated : Nov 16, 2024, 1:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.