ETV Bharat / snippets

స్మాల్​ సేవింగ్స్​ స్కీమ్స్​పై పాత వడ్డీ రేట్లే- వరుసగా మూడోసారి!

author img

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Interest Rates On Small Savings Schemes
Interest Rates On Small Savings Schemes (ETV Bharat)

Interest Rates On Small Savings Schemes : చిన్న మొత్తాల సేవింగ్స్​ పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం మరోసారి యథాతథంగా ఉంచింది. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికానికి పాత వడ్డీ రేట్లే కొనసాగనున్నాయి. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌ వంటి స్కీమ్​లపై వడ్డీ రేట్లను సవరించకపోవడం వరుసగా ఇది మూడోసారి. జులై-సెప్టెంబర్‌ క్వార్టల్​లో కొనసాగిన వడ్డీ రేట్లే మూడో త్రైమాసికంలోనూ కొనసాగుతాయని ఆర్థిక శాఖ నోటిఫికేషన్‌ జారీ చేసింది.

ఇక, సుకన్య సమృద్ధి యోజన పథకంపై ఎప్పటిలానే 8.2 శాతం వడ్డీ ఉంటుంది. మూడేళ్ల టర్మ్‌ డిపాజిట్‌పై 7.1శాతం వడ్డీ వస్తుంది. ఇక పబ్లిక్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ పథకానికి 7.1శాతం, పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ స్కీమ్‌పై 4శాతం వడ్డీ లభిస్తుంది. కిసాన్‌ వికాస్‌ పత్ర పథకంపై 7.5శాతం లభిస్తుంది. 115నెలల్లో గడువు తీరుతుంది. నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌పై 7.7శాతం, మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ 7.4శాతం చొప్పున వడ్డీ లభిస్తుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.