PM Modi Remarks At G20 : ప్రపంచ దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల వల్ల ఏర్పడుతున్న ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభం దక్షిణాది దేశాల (గ్లోబల్ సౌత్ కంట్రీస్)పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపిస్తోందని, దీనిని పరిష్కరించడంపై జీ-20 ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని భారత ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
జీ20 శిఖరాగ్ర సదస్సులో మాట్లాడిన ప్రధాని మోదీ, "గతేడాది భారత్‌లో జీ-20 నిర్వహించినప్పుడు 'ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్' థీమ్‌ను తీసుకున్నాం. అది ప్రస్తుత శిఖరాగ్ర సదస్సు కూడా అనుర్తిస్తుంది" అని మోదీ పేర్కొన్నారు.
Rio de Janeiro, Brazil: At the G20 Session on " social inclusion and the fight against hunger and poverty”, pm narendra modi said, "at the outset, i would like to congratulate president lula for the grand arrangements made for the organisation of the g20 summit and for his… pic.twitter.com/rO40N0DgUh
— ANI (@ANI) November 18, 2024
'ప్రపంచ దేశాల మధ్య ఉన్న వైరుధ్యాలు, ఘర్షణల వల్ల ఆహారం, ఇంధనం, ఎరువుల సంక్షోభం ఏర్పడుతోంది. వీటి దుష్ప్రభావం ప్రపంచంలో దక్షిణాదిన ఉన్న దేశాలపై తీవ్రంగా పడుతోంది. ఈ సవాళ్లను పరిష్కరించడంపై దృష్టి కేంద్రీకరించినప్పుడే మన చర్చలు విజయవంతమవుతాయి' అని మోదీ అన్నారు. సోషల్ ఇన్‌క్లూజన్ అండ్ ది ఫైట్ ఎగెనెస్ట్ హంగర్ అండ్ పావర్టీ' అనే అంశంపై జీ-20 సెషన్లో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Rio de Janeiro, Brazil: PM Narendra Modi said, " i would like to say that countries of the global south are most adversely impacted by the food, fuel and fertilizer crisis caused by global conflicts. so our discussions can only be successful when we keep in mind the challenges and… https://t.co/DAJ5bhnjmi pic.twitter.com/y8ntuXLBKg
— ANI (@ANI) November 18, 2024
'దిల్లీలో జరిగిన సదస్సులో ఆఫ్రికన్ యూనియన్ను జీ20లో శాశ్వత సభ్యత్వాన్ని మంజూరు చేశాం. దీని ద్వారా గ్లోబల్ సౌత్ స్వరాన్ని విస్తరించాం. ఇదే విధంగా ప్రపంచ పాలనా సంస్థలను కూడా మీకు సంస్కరిస్తాం' అని మోదీ పేర్కొన్నారు.
'ఆకలి, పేదరికం లేని ప్రపంచం కోసం బ్రెజిల్ చూపిస్తున్న చొరవకు భారతదేశం ఎప్పుడూ మద్దతు ఇస్తుందని ఈ సందర్భంగా మోదీ పేర్కొన్నారు. దిల్లీ జీ20 సదస్సులో తీసుకున్న ప్రజా కేంద్రీకృత నిర్ణయాలను బ్రెజిల్ అధ్యక్షుడు ముందుకు తీసుకెళ్లారు. మేము సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు ప్రధాన్యం ఇవ్వడం చాలా సంతృప్తి కలిగించే అంశం. మేము ప్రధానంగా సమ్మిళ అభివద్ధి, మహిళ అభివృద్ధి సహా యువ శక్తిపై ప్రత్యేకంగా దృష్టి సారించాం' అని మోదీ అన్నారు.
.