Pushpa 2 Interesting Facts : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా కోసం యావత్ సినీ ప్రపంచం ఎదురుచూస్తోంది. రీసెంట్గా రిలీజైన ట్రైలర్‌తో అంచనాలు మరింత పెరిగిపోయాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా పుష్ప ట్రెండ్ నడుస్తోంది. ఇక ట్రైలర్లో చూపిన పలు సన్నివేశాలు, డైలాగులతో సినిమాపై హైప్ పెరిగిపోయింది. అయితే సినిమాలోని గంగమ్మ జాతర ఎపిసోడ్‌పై ప్రేక్షకుల్లో తొలి నుంచి ఆసక్తి నెలకొంది.
తాజాగా ట్రైలర్లో కూడా జాతర ఎపిసోడ్‌కు సంబంధించి ఒకట్రెండు షాట్స్ చూపించారు. అందులో కన్నడ నటుడు తారక్ పొన్నప్పను అరగుండుతో చూపించి ఒక్కసారిగా అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లారు. మెడలో చెప్పుల దండ, అరగుండుతో పొన్నప్ప డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. కాగా, ఈ జాతర సీన్‌పై కొరియోగ్రాఫర్ విజయ్ పొలాకి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు.
గంగమ్మ జాతర సీన్‌పై మేకర్స్ ఎంతో కేరింగ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై తాజాగా కొరియోగ్రాఫర్ మాట్లాడారు. జాతర ఎపిసోడ్ షూటింగ్‌లో దాదాపు 2000మంది జూనియర్లు, 200మంది డ్యాన్సర్లు పాల్గొన్నట్లు విజయ్ పొలాకి పేర్కొన్నారు. ఇక ఈ గంగమ్మ జాతర సీక్వెన్స్ కోసం 30రోజులకు పైగానే పట్టిందట. స్పెషల్ మేకప్, లైటింగ్ సెటప్స్, ఆర్ట్ వర్క్, మోకోబాట్ కెమెరాతో షూట్ చేసినట్లు తెలిసింది. ఓవరాల్‌గా ఈ ఒక్క ఎపిసోడ్‌కు రూ.50 నుంచి 60 కోట్ల దాకా ఖర్చైనట్లు సమాచారం.
A WILDFIRE RESPONSE 🔥🔥
— Mythri Movie Makers (@MythriOfficial) November 18, 2024
The #RecordBreakingPushpa2TRAILER is a sensation 🌋🌋#Pushpa2TheRuleTrailer 𝐓𝐑𝐄𝐍𝐃𝐈𝐍𝐆 #𝟏 on YouTube with 𝟏𝟐𝟎 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍+ 𝐕𝐈𝐄𝐖𝐒 & 𝟐.𝟑 𝐌𝐈𝐋𝐋𝐈𝐎𝐍+ 𝐋𝐈𝐊𝐄𝐒 ❤️🔥
▶️ https://t.co/O9iK3r5lvb#Pushpa2TheRule… pic.twitter.com/zHBTAjwg18
నెం 1 ట్రెండింగ్
ఇక ఆదివారం రిలీజైన ట్రైలర్ రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది. అన్ని భాషల్లో కలిపి ఈ ట్రైలర్ ఇప్పటికే 120 మిలియన్ వ్యూస్ దాటేసింది. ఒక్క తెలుగులోనే 47 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక 2.3+ మిలియన్ లైక్స్‌తో ఈ ట్రైలర్ ట్రెండింగ్ నెం 1లో కొనసాగుతోంది.
కాగా, సుకుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమా తెరకెక్కించారు. రష్మిక మంధన్నా హీరోయిన్గా నటించింది. ఫాహద్ ఫాజిల్, జగపతిబాబు, సునీల్, అనుసూయ, రావు రమేశ్ తదితరులు ఆయా పాత్రలు పోషించారు. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రవి శంకర్, నవీన్ రూపొందించారు. డిసెంబర్ 5న ఈ సినిమా రిలీజ్ కానుంది.
'పుష్ప 2' ట్రైలర్ విధ్వంసం - ఆ రికార్డ్ సాధించిన తొలి దక్షిణాది చిత్రంగా ఘనత!
'పుష్ప 2 నిజంగానే వైల్డ్ ఫైర్' - ట్రైలర్‌పై సినీ సెలబ్రిటీల రివ్యూస్ ఇవే!