Border Gavaskar Trophy Most Runs : నాలుగు రోజుల్లో భారత్- ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్ఠాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ప్రారంభం కానుంది. రెండు దశాబ్దాలకు పైగా చరిత్ర కలిగిన ఈ సిరీస్‌లో ఎన్నో రికార్డులు నమోదు అయ్యాయి. అలానే అనేక చరిత్రాత్మకమైన ఇన్నింగ్స్ కూడా రికార్డ్ అయ్యాయి. ఇక ఈసారి సిరీస్‌లో ఎలాగైనా నెగ్గాలని ఇరుజట్లు ప్రణాళికలు రచిస్తున్నాయి. ఈ నేపథ్యంలో బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందాం.
అత్యధిక పరుగులు చేసిన టాప్-5
- బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో అత్యధిక పరుగులు చేసిన రికార్డు టీమ్ఇండియా దిగ్గజ బ్యాటర్ సచిన్ తెందూల్కర్ పేరిట ఉంది. 39 టెస్టుల్లో 55 యావరేజ్‌తో సచిన్ 3,630 పరుగులు బాదాడు.
- ఆసీస్ మాజీ కెప్టెన్, బ్యాటర్ రికీ పాంటింగ్ ఈ ట్రోఫీలో సచిన్ తర్వాత అత్యధిక పరుగుల చేసిన ప్లేయర్ల జాబితాలో రెండో ప్లేస్‌లో నిలిచాడు. 29 టెస్టుల్లో 54.36 సగటుతో 2,555 రన్స్ సాధించాడు.
- భారత టెస్టు దిగ్గజం వీవీఎస్ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. లక్ష్మణ్ 29 మ్యాచుల్లో 49.67 సగటుతో 2,437 రన్స్ చేశాడు.
- టీమ్ఇండియా మాజీ రాహుల్ ద్రవిడ్ 32 టెస్టుల్లో 39.68 యావరేజ్ తో 2,143 పరుగులు చేశాడు. ఈ క్రమంలో ఎక్కువ పరుగులు చేసిన జాబితాలో నాలుగో ప్లేస్ దక్కించుకున్నాడు.
- భారత్ నయా వాల్, టెస్టు స్పెషలిస్టు ఛెతేశ్వర్ పుజారా 25టెస్టుల్లో 49.78 సగటుతో 2074 రన్స్ బాదాడు. దీంతో అత్యధిక పరుగుల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు.
అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు
- ఆస్ట్రేలియా ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా కొనసాగుతున్నాడు. ఈ దిగ్గజ స్పిన్నర్ 26 మ్యాచుల్లో 32.40 సగటుతో 116 వికెట్లు పడగొట్టాడు.
- టీమ్ఇండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ 22 మ్యాచ్‌ల్లో 114 వికెట్లు పడగొట్టి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.
- భారత మాజీ కెప్టెన్, స్పిన్నర్ అనిల్ కుంబ్లే 20 టెస్టుల్లో 111 వికెట్లు పడగొట్టాడు. దీంతో అత్యధిక వికెట్ల జాబితాలో మూడో ప్లేస్ లో ఉన్నాడు.
- టీమ్ఇండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఈ లిస్ట్‌లో నాలుగో స్థానం దక్కించుకున్నాడు. భజ్జీ ఈ సిరీస్‌లో 18 మ్యాచ్‌ల్లో 95 వికెట్లు పడగొట్టాడు.
- భారత స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా టాప్ 5లో నిలిటాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ 16 మ్యాచ్‌లు ఆడిన జడ్డూ మొత్తం 85 వికెట్లు తీశాడు.
టన్నుల కొద్దీ పరుగులు - కానీ కెరీర్లో ఒక్క సెంచరీ కూడా లేదు! - Most Runs Without Century
ఆసీస్ గడ్డపై గర్జించిన టాప్ 5 భారత టెస్ట్ కెప్టెన్లు వీరే! - విజయ శాతం ఎంతంటే?