ETV Bharat / snippets

బుల్ రన్​! అదరగొట్టిన స్టాక్​ మార్కెట్లు​- నిఫ్టీ ఆల్ ​టైమ్​ రికార్డ్​

Stock Market Close
Stock Market Close (Getty Images)
author img

By ETV Bharat Telugu Team

Published : Sep 25, 2024, 4:23 PM IST

Stock Market Close : దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు రికార్డ్ స్థాయి గరిష్ఠాల వద్ద ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలతో బుధవారం ఫ్లాట్‌గా ప్రారంభమైన సూచీలు దాదాపు రోజంతా స్తబ్దుగానే ఉన్నాయి. ఆఖరి అరగంటలో బ్యాంకింగ్‌, పవర్‌ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు సరికొత్త గరిష్ఠాల వద్ద ముగిశాయి.

సెన్సెక్స్‌ ఉదయం 84,836.45 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైంది. చాలా సేపటి వరకు ఫ్లాట్‌గా ట్రేడయ్యింది. ఇంట్రాడేలో 84,743.04 వద్ద కనిష్ఠా స్థాయికి పడిపోయింది. ఆఖర్లో ఒక్కసారిగా పుంజుకుని 85,247.42 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 255.83 పాయింట్ల లాభంతో 85,169.87 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 63.75 పాయింట్ల లాభంతో 26,004.15 వద్ద ముగిసింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.