ETV Bharat / sports

భారత్ దెబ్బకు ఆసీస్​ చెత్త రికార్డ్ రిపీట్ - 40ఏళ్లలో ఇది రెండోసారి

తొలి టెస్టులో ప్రత్యర్థి వెన్నువిరిచిన బుమ్రా- దెబ్బకు చెత్త రికార్డ్ రిపీట్ చేసిన ఆసీస్​!

Ind vs Aus 1st Test 2024
Ind vs Aus 1st Test 2024 (Source : Associated Press)
author img

By ETV Bharat Sports Team

Published : 5 hours ago

Ind vs Aus 1st Test 2024 : 2024 బోర్డర్‌- గావస్కర్‌ ట్రోఫీ తొలి టెస్టులో టీమ్‌ఇండియా విజృంభించింది. విదేశీ పిచ్‌లపై ఆస్ట్రేలియాను ఎదుర్కోవడం కష్టమన్న అంచనాలను పటాపంచలు చేసింది. బ్యాటింగ్‌లో తడబడినా బౌలింగ్‌లో సంచలన ప్రదర్శన చేసింది. ఆస్ట్రేలియాకు సొంత గడ్డపై గత ఎనిమిదేళ్లలో ఎదురుకాని అత్యంత దారుణమైన పరిస్థితిని రుచి చూపించింది.

తొలి ఇన్నింగ్స్​లో టీమ్ఇండియా బౌలర్లు ఆసీస్ టాపార్డర్​ను బెంబేలెత్తించారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా ఆసీస్ గడ్డపై నిప్పులు చెరిగారు. బుల్లెట్​ లాంటి బంతులతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. దీంతో ఆసీస్ టాపార్డర్ కుప్పకూలింది. దెబ్బకు 38 పరుగులకే తొలి 5 వికెట్లు కోల్పోయింది. ఇందులో మూడు వికెట్లు బుమ్రానే పడగొట్టాడు. ఈ నేపథ్యంలో ఆసీస్ ఓ చెత్త రికార్డు రిపీట్ చేసింది. 40ఏళ్లలో రెండోసారి 50 పరుగులలోపే సగం (5) వికెట్లు కోల్పోయింది.

2018లో హోబర్డ్​ వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన టెస్టులో ఆసీస్ టాపార్డర్ తేలిపోయింది. ఈ మ్యాచ్​లో ఆస్ట్రేలియా కేవలం 17 పరుగులకే 5 వికెట్లు కోల్పోగా, తాజాగా భారత్‌తో మ్యాచ్​లో 38 పరుగులకే సగం (5) కోల్పోయింది. దీంతో 1980 తర్వాత ఆసీస్​ ఇలాంటి చెత్త రికార్డు నమోదు చెయ్యడం రెండోసారి కాగా, 2018 తర్వాత తొలిసారి.

కాగా, ఆస్ట్రేలియా 50 పరుగులకు చేరుకునే సమయానికి ఆరో వికెట్ కూడా పడిపోయింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 83 పరుగుల వెనుకంజలో ఉంది. ప్రస్తుతం ఆసీస్ స్కోర్ 67-7. అంతకుముందు టీమ్ఇండియా తొలి ఇన్నింగ్స్​లో 150 పరుగులకు ఆలౌటైంది. . టీమ్ఇండియా బ్యాటర్లలో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి (41 పరుగులు) టాప్ స్కోరర్. రిషభ్ పంత్ (37 పరుగులు), కేఎల్ రాహుల్ (26 పరుగులు), ధ్రువ్ జురెల్ (11 పరుగలు) మాత్రమే రెండంకెల స్కోరు సాధించారు. ఆసీస్‌ బౌలర్లలో జోష్ హేజిల్ వుడ్ 4, కమిన్స్, మార్ష్ , స్టార్క్ తలో 2 వికెట్లు దక్కించుకున్నారు.

'డౌట్ లేదు, ఫ్యూచర్​లోనూ బుమ్రానే మూడు ఫార్మాట్లలో నెం 1 బౌలర్'

డే 1 కంప్లీట్- ఒక్కరోజే 17వికెట్లు- తొలి రోజు హీరో బుమ్రానే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.