national

'విరేచనాలు అవుతున్నాయి - ఇంటి ఆహారానికి అనుమతివ్వండి ప్లీజ్​' - దర్శన్‌

By ETV Bharat Telugu Team

Published : Jul 10, 2024, 11:03 PM IST

Actor Darshan Suffering From Diarrhoea
Suffering From Diarrhoea: Actor Darshan Seeks Home-Cooked Food In Jail (ETV Bharat)

Actor Darshan Suffering From Diarrhoea : విచారణ ఖైదీగా ఉన్న తనకు కారాగారంలో ఇస్తున్న ఆహారం జీర్ణం కావడం లేదని, అందుకే ఇంటి నుంచి భోజనాన్ని తెప్పించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో కన్నడ నటుడు దర్శన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

అభిమాని హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్‌ నిందితుడిగా ఉన్నారు. జైలు ఆహారంతో భారీగా బరువు తగ్గడంతోపాటు డయేరియా వంటి సమస్యలు వస్తున్నాయని, అందుకే ఇంటి నుంచి ఆహారం తెప్పించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఓ మంచం, పుస్తకాలు కూడా కావాలని ఆయన అభ్యర్థించారు. దీనిని జస్టిస్‌ ఎస్‌ఆర్‌ కృష్ణకుమార్‌ నేతృత్వంలోని ధర్మాసనం పరిశీలించింది. విచారణ ఖైదీలకు, దోషులకు జైలు నిబంధనలు ఉంటాయని, వాటికి అనుగుణంగానే నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది. తదుపరి విచారణను జులై 11కు వాయిదా వేసింది.

ABOUT THE AUTHOR

...view details