Manipur Violence Today : మణిపుర్లో మరోసారి హింస చెలరేగింది. జిరిబామ్ జిల్లాలో జరిగిన దాడుల్లో ఐదుగురు మృతి చెందారు. మొదట ఓ ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తిని సాయుధులైన దుండగులు కాల్చి చంపారు. అనంతరం రెండు తెగల మధ్య జరిగిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. జిరిబామ్ జిల్లా కేంద్రానికి ఐదు కిలోమీటర్ల దూరంలో నివాసం ఉంటున్న ఇంట్లోకి మిలిటెంట్లు ప్రవేశించి కాల్చి చంపినట్లు అధికారులు తెలిపారు.
మణిపుర్‌లోని స్థానిక జాతుల మధ్య అధికారులు కాల్పుల విరమణ ఒప్పందం కుదిర్చినప్పటికీ తాజాగా గుర్తు తెలియని సాయుధులు మెరుపుదాడికి పాల్పడ్డారు. ఈ దాడులతో తమకు ఎలాంటి సంబంధం లేదని స్థానిక గిరిజన తెగల న్యాయవాద కమిటీ చెప్పింది. గతేడాది మే నుంచి కుకీలు, మైతేయ్ వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో 200 మంది మరణించగా వందల మంది గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు.