ETV Bharat / technology

స్పెషల్ ఫీచర్లతో రియల్​మీ నయా ఫోన్- పవర్​ఫుల్ ప్రాసెసర్, అండర్ వాటర్ ఫొటోగ్రాఫి మోడ్​తో పాటు మరెన్నో..! - REALME GT 7 PRO SMARTPHONE

రియల్​మీ నుంచి అద్భుతమైన స్మార్ట్​ఫోన్​- ప్రీ బుకింగ్ చేసుకున్నవారికే ఆఫర్లే ఆఫర్లు..!

Realme New Model
Realme New Model (Realme)
author img

By ETV Bharat Tech Team

Published : Nov 17, 2024, 1:10 PM IST

Realme GT 7 Pro Smartphone: మార్కెట్లోకి రియల్​మీ నుంచి కొత్త ఫ్లాగ్​షిప్​ రేంజ్ స్మార్ట్​ఫోన్ ఎంట్రీ ఇవ్వబోతోంది. కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లతో నవంబర్ 26న ఈ మొబైల్ లాంచ్ కానున్నట్లు తెలుస్తోంది. ఇది రీలీజ్​ అయిన వెంటనే మధ్యాహ్నం 1 గంట నుంచి realme.comలో కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ఫోన్​ ప్రీ బుకింగ్స్ నవంబర్ 18 నుంచే ప్రారంభం​ కానున్నాయి. ఈ ఫోన్​ను ముందుగా బుక్​ చేసుకునేవారికి కంపెనీ అదిరే ఆఫర్లను ప్రకటించింది. మరెందుకు ఆలస్యం ఈ ఫోన్ ఫీచర్లు, బ్యాంక్ ఆఫర్స్, EMI గురించి మరింత సమాచారం తెలుసుకుందాం రండి.

ఫీచర్లు:

  • డిస్​ప్లే: 6.78- అంగుళాల LTPO Eco OLED
  • రిఫ్రెష్ రేట్: 120Hz
  • బ్రైట్​నెస్: 6000 nits
  • బ్యాటరీ: 6500mAh
  • 120W ఫాస్ట్ ఛార్జింగ్

కెమెరా సెటప్: ఈ రియల్​మీ కొత్త మోడల్ ఫోన్​లో కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. ఇందులో చాలా విశేషమైన కెమెరా సెటప్ ఉంది. ఇది 3x ఆప్టికల్ జూమ్, 120x డిజిటల్ జూమ్​ సపోర్ట్​తో 50MP సోని IMX882 టెలీఫోటో లెన్స్‌ని కలిగి ఉంది. అంతేకాక ఇందులో ఇది 50MP సోని IMX906 ప్రైమరీ కెమెరా, 8MP వైడ్-యాంగిల్ లెన్స్ కూడా ఉన్నాయి.

అండర్ వాటర్ ఫొటోగ్రాఫి మోడ్: ఈ కొత్త స్మార్ట్‌ఫోన్​లో అండర్ వాటర్ ఫొటోగ్రాఫి మోడ్ కూడా ఉంది. దీంతో నీటిలో కూడా ఫొటోలు తీయొచ్చు. IP69 రేట్ కలిగి ఉన్న ఈ మొబైల్​ 2 మీటర్ల లోతు నీటిలో 30 నిమిషాల వరకు మునిగి ఉన్నా ఏం కాదు.

పవర్​ఫుల్ చిప్​సెట్​: ఈ కొత్త రియల్​మీ GT 7 ప్రో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌తో వస్తుంది. ఇండియాలో ఈ పవర్​ఫుల్​ చిప్‌సెట్‌తో వస్తున్న మొట్టమొదటి స్మార్ట్​ఫోన్ ఇదే.

ప్రీమియం లుక్​: ఈ రియల్​మీ GT 7 ప్రో​ బ్యూటిఫుల్ మార్స్ డిజైన్​ ఫోన్​కు ప్రీమియం లుక్​ను అందిస్తుంది. అంతేకాక ఇందులోని క్రిస్టల్ ఆర్మర్ గ్లాస్ దాని లుక్​ను మరింత మెరుగుపరుస్తుంది. ఈ ఫోన్​ IP69 రేటింగ్​తో వస్తుంది. ఇది పూర్తిగా డస్ట్ అండ్ వాటర్ ఫ్రూఫ్.

ధర: ఈ కొత్త ఫోన్ ధరపై ఇంతవరకు ఎలాంటి సమాచారం లేదు. దీని లాంచింగ్ సమయంలోనే ధర కూడా వెల్లడించనున్నారు. అయితే రియల్​మీ సమాచారం ప్రకారం.. ఇది ప్రీమియం ఫ్ల్యాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌గా ఉంటుంది.

ఆఫర్లు ఇవే!: రియల్​మీ GT 7 ప్రో ఫోన్​ను ముందుగా బుక్ ​చేసుకున్నవారికి 3 వేల రూపాయల బ్యాంక్ డిస్కౌంట్, 12 నెలల నో-కాస్ట్ EMI, 1-ఇయర్ స్క్రీన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్, 1 ఇయర్ ఎక్స్‌టెండెడ్ వారంటీ లభిస్తుంది. కస్టమర్లు Amazon.in, Realme అధికారిక వెబ్‌సైట్, ఆఫ్‌లైన్ స్టోర్‌ల నుంచి ఈ ఫోన్‌ను ముందస్తుగా ఆర్డర్​ చేసుకోవచ్చు.

బెంజ్ కారు ప్రియులకు షాక్​!- ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన మెర్సిడెస్

శాంసంగ్ యూజర్లకు గుడ్​న్యూస్- వాటికి ఫ్రీ స్క్రీన్ రీప్లేస్మెంట్!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.