KL Rahul Injury : టీమ్ఇండియా ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్! రీసెంట్గా గాయపడిన స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్, మళ్లీ బరిలోకి దిగినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాతో పెర్త్ టెస్టు కోసం ప్రాక్టీస్‌లో భాగంగా టీమ్ఇండియా ప్లేయర్లు ఇంట్రాస్క్వాడ్‌తో వార్మప్ మ్యాచ్ ఆడుతున్నారు. ఈ మ్యాచ్‌లో రాహుల్ మోచేతికి గాయమైంది. దీంతో రాహుల్ మైదానం వీడాడు. ఆ తర్వాత రోజు కూడా మైదానంలో దిగలేదు. అందువల్ల రాహుల్ గాయంపై అభిమానులు ఆందోళనకు గురయ్యారు.
తాజాగా రాహుల్ మళ్లీ ప్రాక్టీస్‌లో దిగినట్లు క్రీడావర్గాలు పేర్కొన్నాయి. దీంతో రాహుల్ తొలి టెస్టుకు ఆందుబాటులో ఉండడం దాదాపు ఖాయమని తెలుస్తోంది. దీనిపై టీమ్ఇండియా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరీలో యంగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్‌తో కలిసి రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభించే ఛాన్స్ ఉంది.
KL Rahul is fully fit & He's batting practice at WACA in Perth today. (Bharat Sundaresan).
— Tanuj Singh (@ImTanujSingh) November 17, 2024
- Great news for India & fans..!!!! 🌟 pic.twitter.com/MPYAP8AaZJ
గాయాల గోల
ప్రతిష్ఠాత్మక బోర్డర్- గావస్కర్ ట్రోఫీ ముంగిట ప్లేయర్ల గాయాలు అభిమానులను కలవర పెడుతున్నాయి. ప్రాక్టీస్ మ్యాచ్‌లో తొలుత రాహుల్ గాయం బారిన పడితే, తర్వాత యంగ్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్ తీవ్రంగా గాయపడ్డాడు. ఏకంగా గిల్ బొటన వేలికి క్రాక్ వచ్చినట్లు తెలిసింది. శనివారం జట్టులోని ఆటగాళ్లతో ప్రాక్టీస్ మ్యాచ్ సందర్భంగా ఫీల్డింగ్ చేస్తుండగా గిల్ వేలికి బంతి బలంగా తాకింది. నొప్పితో బాధపడుతూ వెంటనే మైదానాన్ని వీడాడు. అయితే స్కానింగ్‌లో అతడి వేలిలో చీలిక వచ్చినట్లు తేలిందని సమాచారం.
తొలి టెస్టుకు వారం రోజులు కూడా లేకపోవడం వల్ల అప్పటి లోగా గిల్ కోలుకోవడం కష్టమే. దీంతో గిల్ పెర్త్ టెస్టుకు దాదాపు దూరమైనట్లే! దీంతో అతడి స్థానంలో మరో యువ ఆటగాడు అభిమన్యు ఈశ్వరన్ జట్టులోకి రావచ్చని తెలుస్తోంది. తుది జట్టులో స్థానం దక్కితే ఈశ్వరన్, ఓపెనింగ్ లేదా వన్‌డౌన్‌లోనే బ్యాటింగ్‌కు వచ్చే ఛాన్స్ ఉంది.
రోహిత్ రావడం కష్టమే!
రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ పెర్త్ టెస్టుకు దూరం కానున్నాడని తొలి నుంచి ప్రచారం సాగుతోంది. అయితే రీసెంట్గా అతడి భార్య రితికా డెలివరీ పూర్తైన నేపథ్యంలో రోహిత్ తొలి టెస్టుకు అందుబాటులో ఉంటాడని అంటున్నారు. కానీ, భార్య ప్రసవించిన క్రమంలో రోహిత్ కొన్ని రోజులు కుటుంబంతో గడపాలని నిర్ణయించుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. కాగా, నవంబర్ 22న ఆసీస్- భారత్ మధ్య తొలి టెస్టు ప్రారంభం కానుంది.
బోర్డర్- గావస్కర్ ట్రోఫీ: ఎలా మొదలైంది- ఆ పేరెలా వచ్చింది- 28ఏళ్ల హిస్టరీ ఇదే!
రెండోసారి తండ్రైన రోహిత్ శర్మ - మగబిడ్డకు జన్మనిచ్చిన రితికా సజ్దే