ETV Bharat / snippets

దళపతి విజయ్‌ పార్టీకి EC పచ్చ జెండా- అప్లై చేసుకున్న 7నెలల తర్వాత!

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2024, 3:10 PM IST

Hero Vijay Party EC
Hero Vijay Party EC (ETV Bharat)

Hero Vijay Party EC : ప్రముఖ తమిళ కథానాయకుడు, దళపతి విజయ్‌ స్థాపించిన పార్టీ 'తమిళగ వెట్రి కళగం'కు ఎన్నికల కమిషన్‌ నుంచి అధికారిక గుర్తింపు లభించింది. పోల్‌ ప్యానెల్‌కు చేసిన అభ్యర్థనకు ఏడు నెలల తర్వాత ఆమోదం లభించింది. అయితే గత నెల చెన్నై శివారు పనైయూర్‌లోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయ్‌ జెండాను ఆవిష్కరించారు. జెండాలో పైన, కింది భాగంలో ఎరుపు, మధ్యలో పసుపు రంగులు ఉన్నాయి. మధ్యలో ఎరుపురంగు వృత్తాకారం లోపల శిరీష పుష్పం, చుట్టూ 28 నక్షత్రాలు ఉన్నాయి. వాటిలో ఐదు నీలం, మిగతావి పచ్చ రంగులో ఉన్నాయి. శిరీష పుష్పానికి రెండు వైపులా ఘీంకరించే ఏనుగు రూపాలు ఉన్నాయి. "ఇప్పటి వరకు మన కోసం మనం శ్రమించాం. ఇకపై తమిళనాడు, తమిళుల ఉన్నతి కోసం సమష్టిగా శ్రమిద్దాం" అని విజయ్ పిలుపునిచ్చారు. 2026లో జరిగే శాసనసభ ఎన్నికల్లో బరిలోకి దిగుతామని వెల్లడించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.