'35ఏళ్లుగా చేస్తున్న సేవలకు పార్టీ ఇచ్చిన గుర్తింపే పీసీసీ చీఫ్ పదవి' - PCC Mahesh Kumar Goud Interview - PCC MAHESH KUMAR GOUD INTERVIEW
🎬 Watch Now: Feature Video
Published : Sep 8, 2024, 3:13 PM IST
Telangana New PCC Chief Mahesh Kumar Goud Interview : పార్టీకి విధేయుడుగా ఉంటూ పార్టీ కోసం పని చేసుకుంటూ పోతే ఫలితం కచ్చితంగా ఉంటుందని తన నియామకం ద్వారా మరొకసారి నిరూపణ అయ్యిందని తెలంగాణ నూతన పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. తాను ఎన్‌ఎస్‌యుఐ నుంచి 35 సంవత్సరాలకుపైగా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ వచ్చానన్నారు. తాను పార్టీకి అందించిన సేవలు, గడిచిన మూడున్నర ఏళ్లుగా పార్టీలో నాయకులను, కార్యకర్తలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లతున్న తీరును గుర్తించిన అధిష్ఠానం తనకు పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టిందన్నారు.
రాష్ట్రంలో పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లతానని మహేష్ కుమార్ గౌడ్ చెబుతున్నారు. జిల్లాల వారీగా పార్టీ నాయకుల అభిప్రాయాలు తీసుకుని తన జట్టును నియమించుకోనున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు ఉన్న పీసీసీ కార్యవర్గం రద్దు అయ్యిందని త్వరలో తన జట్టు ఏర్పాటుకు కసరత్తు మొదలు పెడతానంటున్న మహేష్ కుమార్ గౌడ్‌తో ఈటీవీ ప్రతినిధి తిరుపాల్ రెడ్డి ముఖాముఖి