national

ETV Bharat / snippets

రాజ్​కోట్ గేమ్​జోన్​ ఘటన- 15మంది నిందితులపై లక్ష పేజీల ఛార్జ్​షీట్- ఆ వస్తువుల వల్లే ప్రమాదం!

By ETV Bharat Telugu Team

Published : Jul 25, 2024, 7:40 AM IST

rajkot charge sheet
rajkot charge sheet

Rajkot Game Zone Accident Charge Sheet : గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో మే 25న ఓ గేమ్‌జోన్​లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై 15మంది నిందితులపై లక్షకు పైగా పేజీలతో ఛార్జ్​షీట్​ను బుధవారం పోలీసులు దాఖలు చేశారు. 365మంది సాక్షుల వాంగ్మూలాన్ని నమోదు చేశారు. మూడు-నాలుగు నిమిషాల్లోనే మొత్తం భవనం అగ్నికీలలు చుట్టుముట్టడానికి అక్కడ భారీగా ఉన్న వస్తువులే కారణమని తెలిపారు. నిర్మాణ సామగ్రి, స్పాంజి షీట్లు, చల్లదనాన్ని ఇచ్చే ఇన్సులేటర్లు, వెల్డింగ్‌ పనులతో వచ్చిన నిప్పురవ్వలే కారణమని తేల్చారు. ఇవి క్షణాల్లో అంటుకోవడం వల్ల దాదాపు 27మంది సజీవ దహనమైపోయారని పేర్కొన్నారు. అయితే ఘటనాస్థలంలో పెట్రోలు, డీజిల్‌ వంటివి లేవని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details