ETV Bharat / snippets

అగర్తలా-లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం- పట్టాలు తప్పిన 8బోగీలు

Lokmanya Tilak Express Derailed
Lokmanya Tilak Express Derailed (ETV Bharat)
author img

By ETV Bharat Telugu Team

Published : Oct 17, 2024, 8:09 PM IST

Lokmanya Tilak Express Derailed : అసోంలో లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో 8బోగీలు పట్టాలు తప్పాయి. అయితే ఎవరికి ప్రాణహాని జరగలేదని రైల్వేవర్గాలు తెలిపాయి. ఉదయం అగర్తాల నుంచి ముంబయికి బయలుదేరిన లోకమాన్య తిలక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు మధ్యాహ్నం 3.55 గంటల ప్రాంతంలో అసోంలోని దిబలాంగ్‌ స్టేషన్‌లో పట్టాలు తప్పింది. ఈ ఘటనలో పవర్‌ కార్‌, రైలు ఇంజిన్‌సహా 8బోగీలు పట్టాలు తప్పినట్లు ఈశాన్య రైల్వే జోన్‌ CPRO తెలిపారు. ఈ ప్రమాదంలో ఎవరికి గాయాలు కానీ ప్రాణహాని జరగలేదని చెప్పారు. ఘటనాస్థలంలో సహాయ, ట్రాక్‌ పునరుద్ధరణ పనులు శరవేగంగా సాగుతున్నట్లు CPRO వెల్లడించారు. ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో లుమ్‌డింగ్‌-బదర్‌పుర్‌ మార్గంలో రైళ్ల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు ప్రకటించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.