national

టికెట్‌ లేని ప్రయాణికుల కట్టడిపై రైల్వేశాఖ ప్రత్యేక దృష్టి!

By ETV Bharat Telugu Team

Published : 5 hours ago

Railways Travellers
Railways (ANI)

Railways To Tighten Noose Around Ticketless Travellers : టికెట్‌ తీసుకోకుండా రైలు ప్రయాణం చేసేవారికి చెక్‌ పెట్టేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఇందులో భాగంగా అక్టోబరు 1-15 వరకు, అక్టోబరు 25 నుంచి నవంబరు 10 వరకు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించాలని 17 జోన్ల జనరల్‌ మేనేజర్‌లకు రైల్వేశాఖ లేఖ రాసింది. తనిఖీల నివేదికలను నవంబరు18 నాటికి పంపాలని స్పష్టం చేసింది. సమాన్య ప్రజలేకాదు, టికెట్‌ లేకుండా ప్రయాణించే పోలీసులను కూడా ఉపేక్షించమని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవల గాజియాబాద్‌-కాన్పుర్‌ సెక్షన్‌లో తనిఖీలు నిర్వహించగా, వివిధ రైళ్లలోని ఏసీ కోచ్‌లలో వందలాది మంది పోలీసులు టికెట్‌ లేకుండా ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. వారందరికీ జరిమానా విధించినట్లు అధికారులు వెల్లడించారు. ఆర్​టీఐ వివరాల ప్రకారం, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 3.61కోట్ల మంది టికెట్‌ లేకుండా ప్రయాణించి పట్టుబడగా, వారి నుంచి జరిమానా రూపంలో రూ.2,231 కోట్లను భారతీయ రైల్వే వసూలు చేసింది.

ABOUT THE AUTHOR

...view details