ETV Bharat / snippets

ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ కేసుపై నేడు సుప్రీంకోర్టు తీర్పు

author img

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Supreme Court
Supreme Court (ANI)

Is Watching Child Porn A Crime : ఛైల్డ్‌ పోర్నోగ్రఫీ చూడటం నేరం కాదని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు (సెప్టెంబర్​ 23న) తీర్పు ఇవ్వనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్, జస్టిస్‌ జె.బి.పార్దీవాలా, జస్టిస్‌ మనోజ్‌ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు ఇవ్వనుంది. పోక్సో, ఐటీ చట్టాల ప్రకారం, ఛైల్డ్‌ పోర్నోగ్రఫీని చూడటం తప్పేమీ కాదంటూ మద్రాస్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పు దారుణమైనదని సుప్రీంకోర్టు గతంలోనే వ్యాఖ్యానించింది. ఛైల్డ్‌ పోర్నోగ్రఫీని డౌన్‌లోడ్‌ చేసుకున్నాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిపై క్రిమినల్‌ చర్యలను నిలిపివేస్తూ జనవరి 11న మద్రాసు హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న 28ఏళ్ల యువకుడు వీడియోలు చూడటం తప్ప ఏమీ చేయలేదని, వాటిని ఇతరులకూ పంపలేదని కోర్టు ఆ సందర్భంగా వ్యాఖ్యానించింది. పోర్నోగ్రఫీకి అలవాటుపడిన యువతను శిక్షించడంకన్నా వారిని సరైనమార్గం వైపు నడిపించడంపై దృష్టి పెట్టాలని అభిప్రాయపడింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.