IRCTC Tamil Nadu Hills and Temples Package: తమిళనాడులోని పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుంటున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్. మధుర మీనాక్షి ఆలయం, బృహదీశ్వర ఆలయం సహా మరెన్నో దేవాలయాలతోపాటు దర్శనీయ ప్రదేశాలు చూసేందుకు ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అద్భుతమైన ప్యాకేజీ తీసుకొచ్చింది. ప్యాకేజీ ధర ఎంత? ఏఏ ప్రదేశాలు చూడొచ్చు? ప్రయాణం ఎలా ఉంటుంది అనే వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
"తమిళనాడు హిల్స్ అండ్ టెంపుల్స్" పేరుతో ప్యాకేజీ తీసుకొచ్చింది. ఈ టూర్ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ జర్నీ ద్వారా ఈ టూర్ ఆపరేట్ చేస్తున్నారు. ఈ ప్యాకేజీలో తిరుచ్చి, తంజావూర్, మధురై, కొడైకెనాల్, పళని, కోయంబత్తూరు వంటి ప్రాంతాలను చూడవచ్చు.
ప్రయాణం ఇలా ఉంటుంది:
మొదటి రోజు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సాయంత్రానికి తిరుచ్చి చేరుకుంటారు. అక్కడ ఫార్మాలిటీస్ పూర్తైన తర్వాత ముందుగానే బుక్ చేసిన హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడ బస చేస్తారు.
రెండో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత చెక్ అవుట్ చేసి శ్రీరంగం, జంబుకేశ్వర్ ఆలయాలను దర్శించుకుంటారు. ఆ తర్వాత తంజావూర్‌కు స్టార్ట్ అవుతారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి మధురైకి వెళ్లి హోటల్లో చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడ స్టే చేస్తారు.
మూడో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి కొడైకెనాల్‌కు స్టార్ట్ అవుతారు. అక్కడికి చేరుకుని సిల్వర్ కాస్కేడ్ ఫాల్స్ విజిట్ చేస్తారు. ఆ తర్వాత హోటల్లో చెకిన్ అయ్యి ఆ రాత్రికి అక్కడే ఉంటారు.
నాలుగో రోజు టిఫెన్ తర్వాత కొడైకెనాల్లోని చెట్టియార్ పార్క్, పైన్ ఫారెస్ట్, గుణ కేవ్స్, కొడైకెనాల్ సరస్సు వంటివి సందర్శించుకుంటారు. ఆ రాత్రికి కూడా కొడైకెనాల్‌లోనే బస చేస్తారు.
కాఫీ విత్ కర్ణాటక : హైదరాబాద్ నుంచి IRCTC సూపర్ ప్యాకేజీ! - తక్కువ ధరలోనే ఎంజాయ్ చేసిరావొచ్చు!
ఐదో రోజు అల్పాహారం తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి పళని బయలుదేరుతారు. అక్కడ పళని మురుగన్ ఆలయాన్ని దర్శించుకుంటారు. అక్కడి నుంచి కోయంబత్తూర్ చేరుకుంటారు. హోటల్లో చెకిన్ అయిన తర్వాత ఆ నైట్ అక్కడే ఉంటారు.
ఆరో రోజు బ్రేక్‌ఫాస్ట్ తర్వాత హోటల్ నుంచి చెక్ అవుట్ అయ్యి Geede కార్ మ్యూజియం, ఆదియోగి స్టాట్యూ సందర్శించి తిరిగి కోయంబత్తూర్ చేరుకుంటారు. అక్కడి నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తారు. రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌కు రిటర్న్ ఫ్లైట్ జర్నీ స్టార్ట్ అవుతుంది. 9:30గంటలకు హైదరాబాద్ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.
ధర వివరాలు చూస్తే:
- కంఫర్ట్‌లో.. సింగిల్ ఆక్యూపెన్సీకి రూ.45వేలు, డబుల్ షేరింగ్‌కు రూ.34,350, ట్రిపుల్ షేరింగ్‌కు రూ.32,800గా నిర్ణయించారు.
- 5 నుంచి 11 సంవత్సరాల చిన్నారులకు విత్ బెడ్ అయితే రూ. 26,900, విత్ అవుట్ బెడ్ అయితే రూ.23,550 చెల్లించాలి.
- 2 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు విత్ బెడ్ అయితే రూ.16,550 పే చేయాలి.
ప్యాకేజీలో కవర్ అయ్యేవి ఇవే:
- విమాన టికెట్లు(హైదరాబాద్ - తిరుచ్చి/కోయంబత్తూర్ - హైదరాబాద్)
- హోటల్లో అకామిడేషన్
- 5 బ్రేక్‌ఫాస్ట్‌లు, 5 డిన్నర్లు ఉంటాయి..
- సైట్‌సీయింగ్ కోసం ప్యాకేజీని బట్టి బస్సులు కేటాయిస్తారు.
- ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.
- టూర్ ఎస్కార్ట్ సర్వీసులు ఉంటాయి.
- ప్రస్తుతం ఈ ప్యాకేజీ అక్టోబర్ 5వ తేదీన అందుబాటులో ఉంటుంది.
- ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, టూర్ బుకింగ్ కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
అయోధ్య రామయ్యతో పాటు కాశీ విశ్వనాథుని దర్శనం - రూ.16వేలకే ఐఆర్సీటీసీ అద్దిరిపోయే ప్యాకేజీ!
ఐఆర్సీటీసీ "గ్లోరీ ఆఫ్ గుజరాత్ విత్ మౌంట్ అబూ" - ఈ ప్రదేశాలు చూడొచ్చు! ధర కూడా తక్కువే!