Mankameshwar Temple Prasadam Ban : తిరుపతి లడ్డు తయారీకి కల్తీ నెయ్యి వినియోగించిన వ్యవహారం ఉత్తరాది దేవాలయాలపై, వాటి ప్రసాదాలపై ప్రభావం చూపుతోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అనేక ఆలయాలు జాగ్రత్త పడుతున్నాయి. తాజాగా ఉత్తర్‌ప్రదేశ్, లఖ్‌నవూలోని మంకమేశ్వర ఆలయ నిర్వాహకులు, మార్కెట్ నుంచి కొనుగోలు చేసిన పదార్థాలను దేవునికి ప్రసాదంగా నివేదించడాన్ని పూర్తిగా నిషేధించారు. బయట దుకాణాల నుంచి తెచ్చిన పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ గర్భగుడిలోకి తీసుకురాకూడదని నిబంధనలు విధించారు. తిరుమల ఘటన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సంబంధిత నోటీసుల్లో స్పష్టంగా పేర్కొన్నారు.
తిరుపతి లడ్డు ఎఫెక్ట్ - ఉత్తరాది ఆలయాల్లో కొత్త రూల్స్!
Published : Sep 23, 2024, 11:18 AM IST