ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రభుత్వ స్థలంలో వైసీపీ నేత కట్టడం - కూల్చివేసిన అధికారులు - YSRCP leader occupying govt land - YSRCP LEADER OCCUPYING GOVT LAND

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 29, 2024, 10:38 PM IST

YSRCP Leader Occupying Government Land and Building his Own Office : వైసీపీ హయాంలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించుకుని అనుమతులు లేకుండా సొంత కార్యాలయాన్ని నిర్మించుకుంటున్న ఆ పార్టీ నాయకుడి షెడ్డును అధికారులు కూల్చివేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్​లో ఉన్న కడియం పంచాయితీలో ఎటువంటి అనుమతులు లేకుండా వైసీపీ నాయకుడు గిరజాలు బాబు ఓ కార్యాలయాన్ని నిర్మించుకుంటున్నారు. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తినా పనులు మాత్రం ఆపలేదు. పక్కనే కడుతున్న రైతు బజారుకు సంబంధించిన సిమెంటు, ఇతర సామగ్రిని పెట్టుకునేందుకు ఈ షెడ్డును నిర్మించినట్లు గిరజాలు బాబు అందరినీ నమ్మిస్తున్నాడు. 

కానీ రైతు బజారు నిర్మాణం చేపట్టే కాంట్రాక్టర్ మాత్రం తాము ఇప్పుడే ఎలాంటి కట్టడం చేపట్టడం లేదని వెల్లడించారు. అలాగే మాకు ఆ షెడ్డుకు ఎలాంటి సంబంధం లేదని సంబంధిత అధికారులకు లిఖితపూర్వకంగా రాసి ఇచ్చారు. దీంతో వైసీపీ నాయకుడు గిరజాలు బాబు సొంత కార్యాలయాన్ని నిర్మించుకోవడానికి చేసిన ప్రయత్నంగా అధికారులు నిర్ధారించుకున్నారు. దీంతో గ్రామపంచాయితీ అధికారులు పోలీసుల సహకారంతో షెడ్డు కూల్చివేత పనులు చేపట్టారు. అలాగే గిరజాలు బాబు నిర్మించిన ఇతర కట్టడాలపైనా విచారణ చేపట్టడానికి అధికారులకు ఫిర్యాదు చేస్తామని టీడీపీ నేతలు తెలిపారు. 

ABOUT THE AUTHOR

...view details