YUVA : ఫుట్‌బాల్ టీమ్‌కు యువ డాక్టర్ సేవలు - నాలుగు తరాలుగా వైద్యరంగంలోనే ఆ కుటుంబమంతా - young sports doctor Success Story
Published : Jul 3, 2024, 11:00 PM IST
Young Doctor Serving the Football Team : క్రీడాకారులకు శారీరక సామర్థ్యం అత్యంత ఆవశ్యం. దీనికి వైద్యుల సలహాలు సూచనలు అంతే అవసరం. అయితే క్రీడ జట్టుకు డాక్టర్ కావడమంటే మాటలు కాదు. అతి తక్కువ సమయంలో సమయస్ఫూర్తిని ఉపయోగించి క్రీడాకారుడుకు సేవలు చేయాల్సి ఉంటుంది. అలాంటి ముఖ్యమైన పాత్రను విజయవంతంగా నిర్వహిస్తున్నాడు, సంగారెడ్డి జిల్లాకు చెందిన సాయిదీప్. హైదరాబాద్ ఫుట్‌బాల్ క్లబ్ జట్టుకు డాక్టర్‌గా ప్రాతినిధ్యం వహిస్తూ, ఆటగాళ్ల ఫిట్‌నెస్ బాధ్యతలు చూసుకుంటున్నాడు.
భవిష్యత్తులో సొంతంగా ఆసుపత్రి పెట్టి పేదలకు మంచి వైద్యాన్ని అందించాలంటున్నాడు ఆ క్రీడా వైద్యుడు. అంతేకాదు, సాయిదీప్ రెండేళ్ల క్రితం కజకిస్థాన్ దేశంలో ఎంబీబీఎస్ పూర్తి చేశారు. నాలుగు తరాల నుంచి ఈ యువకుడి కుటుంబ నేపథ్యం వైద్యరంగంలో కొనసాగుతుంది. తాత, ముత్తాతలు నాటు వైద్యం నుంచి ప్రస్తుతం ఇంగ్లీష్ మందుల వరకు వీరి కుటుంబానికి పరిచయం ఉండటం విశేషం. మరి, చిన్నవయసులోనే ఈ అవకాశం ఎలా వచ్చింది? క్రీడాకారులకు ఫిట్‌నెస్ చూసుకునే సమయంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడు? ఆ యువ డాక్టర్ మాటల్లోనే విందామా?