తప్పతాగి ఆర్టీసీ బస్సులో మహిళ హల్చల్ - చిల్లర కోసం కండక్టర్పై దాడి - Women Attack Conductor Hyathnagar
Published : Jan 31, 2024, 1:37 PM IST
Woman Attack On RTC Conductor In Hayathnagar : ఆర్టీసి బస్సు కండక్టర్ మీద ఓ మహిళ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. హయత్నగర్ బస్ డిపోకు చెందిన కండక్టర్ను మద్యం మత్తులో ఓ మహిళ బూతులు తిడుతూ, కాలుతో తన్నుతూ దుర్భాషలాడింది. మొదటి ట్రిప్పులో తన దగ్గర చిల్లర లేదని కండక్టర్ విన్నవించడంతో ఆ మహిళా వినకుండా గొడవకు దిగింది. బస్సులోని తోటి మహిళా ప్రయాణికులు ఎంత చెప్పినా సదరు మహిళ పట్టించుకోకుండా కండక్టర్పై దాడి చేసింది. ఈ ఘటనను టీఎస్ ఆర్టీసీ యాజమాన్యం తీవ్రంగా ఖండిచింది. దీనిపై ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్‌లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Sajjanar Reacts TO Woman Attack On RTC Conductor : మరోవైపు ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా స్పందించారు. నిబద్దతతో సమర్థంగా విధులు నిర్వహిస్తున్న సిబ్బందిపై ఇలాంటి ఘటనలకు పాల్పడితే ఏమాత్రం ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది విధులకు ఆటకం కలిగించి దాడులకు దిగే వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది చాలా ఓపిక, సహనంతో విధులు నిర్వహిస్తున్నారని వారికి సహకరించి క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.