పెట్రోల్‌తో పాటు నీళ్లు - సూర్యాపేట జిల్లాలోని హెచ్‌పీ బంక్ నిర్వాకం - HP Petrol bunk in Chitalapalem - HP PETROL BUNK IN CHITALAPALEM
Published : Sep 11, 2024, 1:38 PM IST
Water Instead Of Petrol In HP Petrol Bunk in Chinthalapalem : సూర్యాపేట జిల్లాలోని చింతలపాలెం మండల కేంద్రంలో ఓ హెచ్‌పీ బంకులో పెట్రోలు కొట్టిస్తే పెట్రోల్‌తో పాటు నీళ్లు వచ్చాయని వినియోగదారులు ఆందోళనకు దిగారు. ఈ విషయంపై సిబ్బందిని అడగగా వారు సమాధానం ఇవ్వలేదు. బాటిల్లో పెట్రోల్ పట్టి చూడగా పెట్రోల్‌తో పాటు నీళ్లు కనిపించాయి. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. బంకు బంద్ చేయాలంటూ నిరసన చేపట్టారు.
వ్యవసాయ పనులకు వాడే వాహనాల్లో ఈ బంక్ పెట్రోల్, డీజీల్నే వాడుతామని రైతులు చెబుతున్నారు. వాహనాలు పాడైతే లక్షల్లో నష్టం వాటిల్లుతుందని వాపోయారు. వినియోగదారులందరినీ మోసం చేసిన సాయి శ్రీనివాస పెట్రోల్ బంక్‌ను వెంటనే సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. నిర్వాహకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని సంబంధిత ఉన్నాతాధికారులకు చేరేలా మీడియా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను పరిష్కరించి, తమకు న్యాయం జరిగేలా చూడాలని బాధితులు కోరారు.