ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ప్రపంచ రూపురేఖలను మార్చేస్తున్న ఏఐ - ఈ కోర్సులు నేర్చుకుంటే జాబ్ పక్కా! - CSE Head Rajeswara Rao Interview - CSE HEAD RAJESWARA RAO INTERVIEW

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 16, 2024, 12:40 PM IST

Updated : Aug 16, 2024, 12:45 PM IST

VR Siddharth Engineering College CSE Head Rajeswara Rao Interview: కృత్రిమ మేధ ప్రపంచ రూపురేఖలను మారుస్తోంది. హలో సిరి, అలెక్సా చాట్‌ జీపీటీలు ఇందులో భాగమే. ఇప్పటికే పారిశ్రామిక రంగంలో విరివిగా వినయోగమవుతున్న కృత్రిమ మేధ విద్య, వైద్య రంగాల్లోనూ విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేందుకు సిద్ధమౌతోంది. జావా, స్టాటిస్టిక్స్‌, మ్యాథ్స్‌, మిషన్‌ లెర్నింగ్‌ టెక్నాలజీ స్కిల్స్‌ వంటి కోర్సులు ఏఐకి అవసరం అని అంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో ఇంజినీరింగ్‌ కళాశాలల్లో కృత్రిమ మేధ కోర్సులు నిర్వహిస్తున్నారు. 

అన్నిరంగాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తరించనున్న నేపథ్యంలో ఈ కోర్సులను నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. మరి, భవిష్యత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం ఎలా ఉండబోతోంది? ఆర్టిఫిషియల్‌ ఇంటిలిజెన్స్‌లో ఉండే కోర్సులు, ఉపాధి అవకాశాలు ఏ విధంగా ఉన్నాయనే అంశాలను వీఆర్​ సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల డీమ్డ్ టు బి యూనివర్శిటీ సీఎస్​ఈ విభాగాధిపతి ప్రొఫెసర్ డి.రాజేశ్వరరావును అడిగి తెలుసుకుందాం రండి. 

Last Updated : Aug 16, 2024, 12:45 PM IST

ABOUT THE AUTHOR

...view details