CHANDRABABU CONGRATULATES NITISH KUMAR REDDY: బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీ 2024లో ఆస్ట్రేలియాతో మెల్‌బోర్న్‌లో జరుగుతున్న నాలుగవ టెస్టు మ్యాచ్‌లో సెంచరీ సాధించిన విశాఖపట్నం యువకుడు కె.నితిష్ కుమార్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు. టెస్టు మ్యాచ్‌లలో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కావడం మరింత సంతోషం కలిగిస్తున్నదన్నారు. రంజీలో ఆంధ్రా తరఫున ఎన్నో విజయాలు సాధించిన నితీశ్ కుమార్ రెడ్డి, అండర్ 16లో సైతం అద్భుత విజయాలు అందుకున్న విషయం మనకు తెలిసిందేనని అన్నారు. ఇలాంటి విజయాలు మరిన్ని సాధించాలని, భారత క్రికెట్ జట్టులో ఉండి దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింప జేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్షించారు.
మంత్రి లోకేశ్ అభినందనలు: మెల్‌బోర్న్ టెస్టులో శతకం సాధించిన నితీశ్‌కు మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. విశాఖ కుర్రాడు నితీష్‌కుమార్‌రెడ్డి ఆసీస్‌పై అద్భుత శతకం చేశారని కొనియాడారు. ఒత్తిడిలోనూ నితీశ్‌కుమార్‌రెడ్డి అద్భుత శతకం సాధించారని, అతని ధైర్యం, పట్టుదల, సంకల్ప శక్తిని చూసి గర్విస్తున్నామన్నారు.
నితీశ్‌కు రూ.25 లక్షలు నగదు ప్రోత్సాహం: ఏసీఏ (Andhra Cricket Association) తరఫున క్రికెటర్ నితీశ్‌కు రూ.25 లక్షలు నగదు ప్రోత్సాహకాన్ని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎంపీ కేశినేని శివనాథ్ ప్రకటించారు. నితీశ్‌కు అభినందనలు తెలిపిన శివనాథ్, త్వరలోనే సీఎం చేతుల మీదుగా నగదు బహుమతిని అందిస్తామని అన్నారు. దేశంలోనే అత్యాధునిక వసతులతో స్టేడియాన్ని అమరావతిలో నిర్మిస్తామని, ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడేలా విశాఖ స్టేడియం సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు. ఏపీకి కూడా ఐపీఎల్ టీమ్ ఉండేలా ఏసీఏ ఆలోచన చేస్తోందని వెల్లడించారు.
బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీ 2024 లో ఆస్ట్రేలియాతో మెల్బోర్నలో జరుగుతున్న క్రికెట్ నాలుగవ టెస్టు మ్యాచ్ లో సెంచరీ సాధించిన విశాఖపట్నం యువకుడు కె.నితిష్ కుమార్ రెడ్డికి అభినందనలు. టెస్టు మ్యాచ్ లలో ఈ ఘనత సాధించిన భారతీయ క్రికెటర్లలో మూడో అతి పిన్న వయస్కుడు కూడా కావడం మరింత… pic.twitter.com/93QcoWeTOx
— N Chandrababu Naidu (@ncbn) December 28, 2024
And it’s a 100!
— Lokesh Nara (@naralokesh) December 28, 2024
I am overjoyed to see Vizag boy @NKReddy07 demonstrate courage, grit, and sheer will-power to deliver a remarkable maiden hundred under pressure against the Aussies. We are proud of you Nitish. Keep going. We are cheering on to every run.
Thanks for your… pic.twitter.com/KrzPVqjJWd
Heartiest congratulations to #NitishKumarReddy on his remarkable century against Australia in today’s Test match! 🏏🔥 His grit and determination have made the state of Andhra Pradesh and the nation proud.
— Kesineni Sivanath (@KesineniS) December 28, 2024
To honor this extraordinary feat, the Andhra Cricket Association is… pic.twitter.com/QSh5H5thDc
ఆసీస్ గడ్డపై తెలుగోడి సత్తా: కాగా మెల్‌బోర్న్ టెస్టులో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డి సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న సమయంలో బ్యాటింగ్‌కి వచ్చిన నితీశ్ టీమ్ ఇండియాను తన అద్భుత పోరాటంతో మంచి స్థితిలోకి తీసుకొచ్చాడు. ఈ క్రమంలోనే 171 బంతుల్లో తన కెరీల్లో తొలి అంతర్జాతీయ శతకం నమోదు చేసుకున్నాడు. తద్వారా తన తొలి సెంచరీని ఆస్ట్రేలియా గడ్డపై సాధించాడు. నితీశ్ కుమార్ రెడ్డి శతకాన్ని స్టేడియంలో స్వయంగా చూసిన అతడి తండ్రి భావోద్వేగానికి గురయ్యారు.
కాగా, మెల్‌బోర్న్ టెస్టులో 8వ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన నితీశ్ అద్భుత పోరాట పటిమ కనబర్చాడు. మరో బ్యాటర్ వాషింగ్టన్ సుందర్‌తో కలిసి ప్రత్యర్థి బౌలర్లకు ఎక్కడా అవకాశం ఇవ్వకుండా పరుగులు నమోదు చేశాడు. ఈ ఇద్దరూ కలిసి 8వ వికెట్‌కు 285 బంతులు ఎదుర్కొని 127 పరుగుల భాగస్వామ్యం నిర్మించారు. ఈ క్రమంలోనే నితీశ్ కుమార్ రెడ్డి అరుదైన ఘనత సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై ఎనిమిదో స్థానంలో వచ్చి అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా నిలిచాడు. ఈ లిస్ట్‌లో ఇప్పటి వరకూ అనిల్ కుంబ్లే (ఆడిలైడ్‌లో 87 పరుగులు) టాప్ ప్లేస్‌లో ఉండగా, తాజాగా నితీశ్ కుమార్ రెడ్డి ఈ రికార్డుని బ్రేక్ చేశాడు.
నితీశ్ 'వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్'- కెరీర్లో తొలి సెంచరీ- కంగారూల గడ్డపై తెలుగోడి సత్తా
నితీశ్ ది సేవియర్- ఫాలో ఆన్ తప్పించిన తెలుగోడు- పుష్ప స్టైల్లో సెలబ్రేషన్స్