Son And Daughter-In-Law Killed Their Mother for Gold in Vijayawada : నవమాసాలు మోసి, జన్మనిచ్చిందనే కనికరం కూడా లేకుండా తన తల్లి ముఖంపై దిండు అదిమిపట్టి చంపేశాడో ఓ కొడుకు. మరో ఘటనలో కుటుంబ కలహాలతో కన్న తండ్రినే గొడ్డలితో వేటు వేసి బలితీసుకున్నాడు మరో పుత్రరత్నం. మానవత్వానికి మచ్చ తెచ్చే ఈ రెండు ఘటనలతో స్థానికులు ఒక్కసారిగా నిశ్చేష్టులయ్యారు.
దిండుతో ఊపిరాడకుండా చేసి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడలోని గుణదల పోలీసు స్టేషన్ పరిధిలో పప్పులమిల్లో గత కొంతకాలంగా లక్ష్మి(62)ని ఆమె పెద్ద కుమారుడు సాంబ శివరావు నివాసం ఉంటున్నారు. ఇటీవల తల్లి,కుమారుడు మద్య ఆస్తి తగాదా నడుస్తోంది. తల్ల వద్ద ఉన్న బంగారం కావాలని కుమారుడు కొంత కాలంగా డిమాండ్ చేస్తున్నాడు. తల్లి నిరాకరించడంతో ఇద్దరి మద్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో తన భార్యతో కలిసి మరీ మధ్యరాత్రి వేళలో నిద్రిసుండగా తన తల్లి గొంతు నులిమి, దిండుతో ఇరువురూ కలిసి లక్ష్మిని కడతేర్చారు. ఈ నోటా ఆ నోట సమాచారం పోలీసులకు చేరడంతో ఈ వీరిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4లక్షల విలువ చేసే బంగారు అభరణాలను స్వాధీనం చేసుకుని అరెస్టు చేశారు.
Son Killed Father In Nellore District: నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం యాల్లాయపాలెం గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గ్రామంలోని తాళ్లమిట్ట ఎస్టీ కాలనీలో తండ్రిని కన్న కుమారుడే హతమార్చిన సంఘటన వెలుగు చూసింది. పొట్లూరు పోలయ్య తన కుమారుడు సుబ్రహ్మణ్యం తో కలిసి కొన్ని సంవత్సరాలుగా తాళ్లమిట్టలో నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో కుమారుడు సుబ్రహ్మణ్యం తండ్రి పోలయ్యను గొడ్డలితో నరికి చంపి పరారయ్యాడు. సమాచారం అందుకున్న రూరల్ డీఎస్పీ శ్రీనివాసరావు, కొడవలూరు సిఐ సురేంద్ర బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. సుబ్రహ్మణ్యంకు అప్పుడప్పుడు మానసికస్థితి సరిగా ఉండదని గ్రామస్తులు చెబుతున్నారు. దీనిపై కొడవలూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
డెడ్ బాడీ పార్సిల్ కేసు : వర్మ ఇంట్లో మరో చెక్క పెట్టె, చేతబడి సామగ్రి
ఏలూరు జిల్లాలో దారుణం - ఆస్తి తగాదాలతో తల్లి, కుమారుడి దారుణ హత్య