ETV Bharat / health

ఎటువైపు తిరిగి పడుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? - గురక సమస్యకూ చెక్! - BEST SLEEPING POSITION

సరైన నిద్ర భంగిమ అందరికీ మంచిదట - గుండెకూ మేలంటున్న పరిశోధనలు

best_sleeping_position
best_sleeping_position (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2025, 10:08 AM IST

Best Sleeping Position : నిద్ర విషయంలో చాలా మందికి చాలా సందేహాలుంటాయి. నిద్ర పట్టడం మొదలుకుని ఎంత సేపు నిద్రపోవాలి? ఏ దిక్కువైపు తల పెట్టుకోవాలి? ఎటు వైపు కాళ్లు పెట్టకూడదో! అనే సందేహాలు వారికి నిద్ర పట్టకుండా చేస్తాయి. బోర్లా పడుకోవాలా, వెల్లకిల్లా పడుకోవాలా? లేక ఎడమ వైపు తిరిగి పడుకోవాలా, లేదంటే కుడివైపా అనే ఆలోచనలు వేధిస్తుంటాయి. ఈ నేపథ్యంలో నిద్ర గురించి చేసిన ఓ అధ్యయనం ఆసక్తికరమైన అంశాలు వెల్లడించింది. అవేమిటో తెలుసుకుని అన్ని సందేహాలకు చెక్ పెట్టేద్దాం.

కొంత మందికి బోర్లా, వెల్లకిలా పడుకోవడం అలవాటు! కానీ, ఎడమవైపుకి తిరిగి పడుకోవడమే మంచిదని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది. తద్వారా భవిష్యత్తులో మెదడు సంబంధిత సమస్యలు తలెత్తకుండా ముందు జాగ్రత్తపడచ్చని తేల్చింది. ఏ వయసు వారికైనా ఈ నిద్రా భంగిమే మంచిదంటున్నారు నిపుణులు. దీనివల్ల ఆరోగ్యపరంగా బహుళ ప్రయోజనాలు చేకూరతాయని సూచిస్తున్నారు.

ఈ నూనెతో మొటిమలకు చెక్? - ముఖం సున్నితమై స్కార్ఫ్ కట్టుకోవాల్సిందేనట!

జీర్ణవ్యవస్థకు మేలు :

జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే దాదాపు అన్ని అవయవాల పనితీరు కూడా బాగుంటుంది. ఎడమవైపుకి తిరిగి పడుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం మెరుగుపడుతుందట. జీర్ణానంతరం ఆహారంలో మిగిలిన వ్యర్థాలు, టాక్సిన్లు మొదట పెద్ద పేగులో ప్రారంభ భాగమైన సెకమ్‌లోకి చేరుకుంటాయి. అది మన శరీరంలో కుడివైపున ఉంటుంది. ఇవి క్రమంగా ఎడమవైపు ఉన్న పెద్ద పేగు చివరి భాగమైన పురీష నాళం వరకు ప్రయాణిస్తాయి.

ఈ నేపథ్యంలో మనం ఎడమవైపు తిరిగి పడుకున్నప్పుడు గురుత్వాకర్షణ కారణంగా కుడి నుంచి ఎడమకు ఈ వ్యర్థాలన్నీ సులభంగా వెళ్లిపోయే అవకాశం దొరుకుతుంది. తద్వారా ఉదయాన్నే సులభంగా వ్యర్థాలన్నీ మలం రూపంలో బయటికి వెళ్లిపోతాయి. పెద్ద పేగు ఎప్పటికప్పుడు పూర్తిగా ఖాళీ కావడం వల్ల పేగుల ఆరోగ్యం మెరుగుపడి పొట్ట ఆరోగ్యానికి, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికీ దోహదం చేస్తుంది. అందుకే పడుకునేటప్పుడైనా, విశ్రాంతి తీసుకునేటప్పుడైనా ఎడమవైపు చాలా బెటర్ అని నిపుణులు చెప్తున్నారు.

గుండె ఆరోగ్యానికీ మంచిది :

అనారోగ్యకర ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఆందోళన వంటి మానసిక సమస్యల కారణంగా మహిళల్లోనూ గుండె సంబంధిత సమస్యలకు దారితీస్తున్నట్లు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. భవిష్యత్​లోనూ ఇలాంటి సమస్యలు రాకుండా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడంలో నిద్రా భంగిమ కీలకమే అంటున్నారు నిపుణులు. శరీరంలో గుండె ఎడమ వైపు ఉంటుంది కాబట్టి ఎడమవైపుకి తిరిగి నిద్రపోవడం వల్ల గురుత్వాకర్షణ కారణంగా రక్తం సులభంగా గుండెకు సరఫరా అవుతుంది. తద్వారా గుండెపై ఒత్తిడి తగ్గి గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.

best_sleeping_position
గర్భిణులకు మంచి నిద్రా భంగిమ ఇదే (ETV Bharat)

గర్భిణులకు మేలు :

గర్భిణులకూ ఎడమ వైపు తిరిగి పడుకోవడం సౌకర్యంతో పాటు నిద్రకు, కడుపులో బిడ్డకు ఆరోగ్యమని నిపుణులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (NIH) జర్నల్ ప్రచురించింది. వీపు, నడుము, వెన్నెముకపై ఒత్తిడి తగ్గి నిద్ర చక్కగా పడుతుందట. గర్భాశయానికి, పిండానికి రక్తప్రసరణ మెరుగుపడి కడుపులో ఎదిగే బిడ్డకు పోషకాలు కూడా సులభంగా అందుతాయట! అందుకే ఎడమవైపు తిరిగి పడుకోవడం తల్లీబిడ్డల ఆరోగ్యానికి మేలు చేస్తుందట. కాళ్లు కాస్త ముడుచుకొని, మధ్యలో చిన్న దిండు పెట్టుకుంటే పొట్టపై ఒత్తిడి పడకుండా, సులభంగా నిద్రలోకి జారుకోవచ్చట.

ఆయాసం దూరం :

ఒక్కోసారి మనకు తెలియకుండానే అతిగా ఆయాస పడుతుంటాం. ఇలాంటప్పుడు ఓ పది నిమిషాలు ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందచ్చంటున్నారు నిపుణులు. జీర్ణవ్యవస్థలోని పాంక్రియాటిక్‌ ఎంజైమ్స్‌ సమర్థంగా పనిచేసి ఆహారం జీర్ణం కావడంలో తోడ్పడతాయట! తద్వారా ఆయాసం నుంచి ఉపశమనం పొందొచ్చు.

గురక పెడుతున్నారా?

పురుషుల్లోనే కాకుండా కొంతమంది మహిళలు కూడా నిద్రలో గురక పెడుతుంటారు. అధిక బరువు, సైనస్‌ సమస్యలున్న వారిలో ఈ లక్షణం ఎక్కువగా కనిపిస్తుంది. గురక వల్ల నిద్ర సరిగా పట్టకపోగా భవిష్యత్తులో రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలకూ దారితీయచ్చంటున్నారు నిపుణులు. అందుకే ఎడమవైపు లేదా కుడివైపు తిరిగి పడుకోవడం వల్ల శ్వాస తీసుకోవడం మెరుగుపడి గురక సమస్యనూ తగ్గించుకోవచ్చంటున్నారు.

ఆరోగ్యానికి మంచిదని ఎప్పుడూ ఎడమవైపు తిరిగి పడుకోలేం. అలాంటప్పుడు ఉపశమనం కోసం అప్పుడప్పుడూ కాసేపు కుడివైపు, వెల్లకిలా పడుకునేలా అలవాటు చేసుకోవాలి. దాంతో శరీరం బిగుసుకుపోకుండా జాగ్రత్తపడడంతో పాటు శారీరక నొప్పులు రాకుండా కూడా చూసుకోవచ్చు.

NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.

చనిపోయి తిరిగొస్తే ఎంత బాగుంటుందో! - జపాన్​లో మళ్లీ పుట్టేందుకు జనం క్యూ

ఆఫీసులో పని​ చేస్తుంటే నిద్ర వస్తుందా! - ఈ టిప్స్​ పాటిస్తే రోజంతా హుషారు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.