ETV Bharat / state

వైఎస్ జగన్ సోదరుడికి సంక్రాంతి గిఫ్ట్ - ఆగమేఘాలపై కదిలిన దస్త్రం! - YS VENKATA REDDY LEASE ISSUE

వైఎస్‌ వెంకటరెడ్డికి ముగ్గురాయిలీజు మంజూరు - పండుగ సెలవుల్లోనూ ఉత్తర్వులిచ్చిన గనుల శాఖ

YS Venkata Reddy Lease Issue
YS Venkata Reddy Lease Issue (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 29, 2025, 10:02 AM IST

YS Venkata Reddy Lease Issue : వైఎస్సార్సీపీ అధినేత జగన్‌కు వరుసకు సోదరుడు, పులివెందులకు చెందిన వైఎస్‌ వెంకటరెడ్డికి సంక్రాంతి పండుగ సమయంలో లీజు రూపంలో భారీ కానుక ఇచ్చింది రాష్ట్ర గనుల శాఖ. వైఎస్సార్‌ జిల్లాలో దాదాపు రూ.100 కోట్లకు పైగా విలువైన ముగ్గురాయి నిల్వలున్న లీజును ఇతనికి కట్టబెట్టింది. సెలవు రోజుల్లో, ఈనెల 15న కనుమ పండుగ నాడు లీజు కేటాయిస్తూ గనులశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ దస్త్రం ఆఘమేఘాలపై కదలడం వెనుక వైఎస్సార్‌ జిల్లాకు చెందిన టీడీపీ ముఖ్యనేత ఒకరి సహకారం ఉన్నట్లు తెలుస్తోంది. వేములలో సర్వే నంబర్లు 1021/26, 43ల్లో 11.6 హెక్టార్లలో ముగ్గురాయి ఖనిజ లీజుకు వెంకటరెడ్డి 2016లో అర్జీ చేసుకున్నారు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక ఆ దస్త్రం వేగంగా కదిలింది. 9.55 హెక్టార్లలో ముగ్గురాయి లీజుకు గనులశాఖ ఎర్రగుంట్ల సహాయ సంచాలకులు 2020 మార్చిలో ప్రతిపాదన పంపారు.

Mines Venkata Reddy Irregularities : గనులశాఖ అప్పటి సంచాలకుడు వీజీ వెంకటరెడ్డి ఈ లీజు ఫైల్‌పై ప్రత్యేక శ్రద్ధ చూపారు. తాజాగా వైఎస్‌ వెంకటరెడ్డికి 9.55 హెక్టార్లలో 20 సంవత్సరాల కాల వ్యవధితో లీజు మంజూరుచేస్తూ ఈనెల 15న డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీచేశారు. ఇక్కడి ఖనిజానికి మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఈ లీజులో ఏటా 1390 టన్నుల చొప్పున ముగ్గురాయిని వెలికి తీయనున్నారు. దీని ప్రస్తుత మార్కెట్‌ విలువ టన్ను రూ.30,000ల నుంచి రూ.35,000ల వరకు ఉంది.

వైఎస్ జగన్​తో బంధుత్వమిలా : రాజారెడ్డికి రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డి సహా ఆరుగురు సంతానం. వీరిలో రాజశేఖరరెడ్డి కుమారుడే మాజీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి. చినకొండారెడ్డికి ప్రకాశ్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, జోసఫ్‌రెడ్డి ఇలా ఆరుగురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కలిపి 11 మంది సంతానం. వీరిలో ప్రతాప్‌రెడ్డి కుమారుడే వెంకటరెడ్డి. ఇక భాస్కర్‌రెడ్డి కుమారుడు అవినాష్‌రెడ్డి కడప ఎంపీగా ఉన్నారు. రాజారెడ్డి మనవడైన జగన్, చినకొండారెడ్డి మనవడైన వెంకటరెడ్డి వరుసకు సోదరులు. ఎంపీ అవినాష్‌రెడ్డికి వెంకటరెడ్డి సొంత పెదనాన్న కుమారుడు అవుతారు.

APMDC: జోరుగా ముగ్గురాయి అక్రమ రవాణా.. సిబ్బంది మధ్య విభేదాలతో వెలుగులోకి

ముగ్గురాయి టెండరూ అస్మదీయులకే - డిమాండ్‌ ఉన్నా తక్కువ ధరకే

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.