Fake IPS Officer in Pawan Kalyan Parvathipuram Tour : పార్వతీపురం మన్యం జిల్లాలో ఇటీవల ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పర్యటించిన విషయం తెలిసిందే. ఈ పర్యటనలో ఓ నకిలీ ఐపీఎస్ అధికారి పాల్గొన్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిపై ఇప్పటికే పోలీసు అధికారులు విచారణ చేపట్టారు. ఈ నకిలీ ఐపీఎస్ అవతారం ఎత్తిన వ్యక్తిని విజయనగరం జిల్లా గరివిడికి చెందిన మాజీ సైనికుడు సూర్య ప్రకాశ్‌గా పోలీసులు అనుమానిస్తున్నారు.
మన్యం జిల్లాలోని సాలూరు, మక్కువ మండలం బాగోజాలలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటించారు. ఆయన పర్యటనతో అక్కడ ఏళ్లుగా ఎదురు చూసిన రోడ్డు పనులు పూర్తి అయ్యాయి. ఇదిలా ఉండగా, ఇప్పుడు నకిలీ ఐపీఎస్ అధికారి వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.