కామారెడ్డి బల్దియా కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల సోదాలు - బల్దియా కార్యాలయం విజిలెన్స్ సోదాలు
Published : Feb 7, 2024, 2:10 PM IST
Vigilance Officer Raids on Municipal Office In Kamareddy : కామారెడ్డి బల్దియాతో పాటు వివిధ శాఖల్లో అవినీతిపై ప్రస్తుత కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డి గతంలో విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంట్లో భాగంగా కామారెడ్డి జిల్లా కేంద్రానికి విజిలెన్స్ అధికారుల బృందం చేరుకుంది. కామారెడ్డి బల్దియా కార్యాలయంతో పాటు ప్రముఖ వస్త్రా దుకాణాలపై సోదాలని నిర్వహించారు. కామారెడ్డి బల్దియా కార్యాలయంలో నాలుగు విభాగాలపై గతంలో ఎమ్మెల్యే రమణారెడ్డి ఫిర్యాదు చేసిన అంశాలను సంబంధిత అధికారుల ద్వారా నివేదికలు అందించాలని గతంలోనే విజిలెన్స్ అధికారులు ఆదేశాలని జారీ చేశారు.
Vigilance Officers Raids In Kamareddy : సంబంధిత సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించి మున్సిపల్ కార్యాలయంలో వారి ఆధ్వర్యంలోనే సోదాలు చేపట్టారు. ప్రధానంగా టౌన్ ప్లానింగ్‌తో పాటు సానిటరీ, రోడ్స్, రెవెన్యూ కనెక్షన్స్‌పై ఫిర్యాదులు అందడంతో వాటిపైనే దృష్టి సారించారు. పట్టణంలో నిర్మిస్తున్న భారీ అంతస్తుల నిర్మాణంలో సెల్లార్ పనులు తదితర వాటి విషయాలపై కూడా విజిలెన్స్ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం. అలాగే వివిధ శాఖల్లో అవినీతిపై పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నారు.