Live : వనపర్తిలో బీజేపీ జన సభ - ముఖ్య అతిథిగా హాజరైన కేంద్రమంత్రి అమిత్ షా - Union Minister Amit Shah Live - UNION MINISTER AMIT SHAH LIVE
Published : May 11, 2024, 12:12 PM IST
|Updated : May 11, 2024, 2:05 PM IST
Amit Shah Vikarabad Public Meeting Live : తెలంగాణ నుంచి బీజేపీకి రెండంకెల సీట్లు రావాలనే లక్ష్యంతో ప్రధాని మోదీ మార్చి, ఏప్రిల్, మే నెలల్లో నాలుగుసార్లు రాష్ట్రానికి వచ్చారు. చివరగా హైదరాబాద్ నారాయణపేట ఎల్బీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. నరేంద్ర మోదీ మొత్తంగా రాష్ట్రంలో పది బహిరంగ సభలు, అనేక రోడ్ షోలలో పాల్గొన్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే మూడుసార్లు రాష్ట్రానికి వచ్చి బీజేపీ ప్రచారాన్ని ఊపందుకున్నారు. ఇవాళ మరోసారి వనపర్తి, వికారాబాద్‌లో జరిగే బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం చేవెళ్ల నియోజకవర్గం వికారాబాద్‌లో జరిగే జనసభలో అమిత్ షా పాల్గొన్నారు. బీజేపీ ఎంపీ అభ్యర్థుల తరఫున ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌లపై పలు విమర్శలు చేస్తున్నారు. అనంతరం మధ్యాహ్నం నాగర్ కర్నూల్ నియోజకవర్గం వనపర్తిలో అమిత్ షా బహిరంగ సభకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సభ తర్వాత తిరిగి దిల్లీకి చేరుకుంటారు.
Last Updated : May 11, 2024, 2:05 PM IST