తెలంగాణ

telangana

By ETV Bharat Telangana Team

Published : Apr 9, 2024, 12:02 PM IST

Updated : Apr 9, 2024, 12:16 PM IST

ETV Bharat / videos

LIVE : తెలంగాణ భవన్​లో ఉగాది వేడుకలు - Ugadi Celebrations 2024

Ugadi Celebrations at Telangana Bhavan in Hyderabad Live : తెలుగువారి నూతన సంవత్సరం అంటే ఉగాది పండగనే అని చెబుతారు. ముఖ్యంగా ఉగాది రోజు తెలుగు లోగిళ్లలో భక్తిశ్రద్ధలతో పూజలు చేసి, పంచాంగ శ్రవణం ఆలకిస్తారు. ఉగాది పర్వదినాన పండితులు చెప్పే రాశి ఫలాలను అందరూ ఎంతో శ్రద్ధగా ఆలకిస్తారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉగాది పండగను చిన్నాపెద్దా అంతా కలిసి కట్టుగా చేసుకుంటారు. ఆరోజు తీపి, కారం, వగరు, ఉప్పు, పులుపు, చేదు వంటి షడ్రుచులతో చేసిన ఉగాది పచ్చడిని సేవిస్తారు. ఈ పదార్థం తయారీ వాడే ఒక్కో పదార్థం మనిషి జీవితంలో ఒక్కో అనుభవానికి చిహ్నంగా చెబుతారు. ఇప్పుడు తెలుగు నామ సంవత్సరంలో శోభకృత్​ నామ సంవత్సరం నుంచి క్రోధి నామ సంవత్సరంలోకి అడుగుపెట్టాము. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ ఆధ్వర్యంలో హైదరాబాద్​లోని తెలంగాణ భవన్​లో నిర్వహించిన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో కేటీఆర్​తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్యనేతలు పాల్గొన్నారు.
Last Updated : Apr 9, 2024, 12:16 PM IST

ABOUT THE AUTHOR

...view details