వేములపాడు ఘాట్‌రోడ్డుపై రెండు ఆర్టీసీ బస్సులు ఢీ - 13 మందికి గాయాలు - వేములపాడులో రోడ్డు ప్రమాదం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2024, 2:00 PM IST
Road Accident at Vemulapadu Ghat Road: ప్రకాశం జిల్లా హనుమంతునిపాడు మండలం వేములపాడు ఘాటు రోడ్డు వద్ద ఎదురెదురుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 13 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో పొదిలి, కంభం వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రెండు ఆర్టీసీ బస్సులు ఎదురెదురుగా ఢీకొన్న సమయంలో బస్సులో ఉన్న ప్రయాణికులు కుదుపులకు గురవ్వటంతో స్వల్ప గాయాలైనట్లు ప్రయాణికులు తెలిపారు.
TWO RTC Buses Crashed in Vemulapadu: కంభం నుంచి కనిగిరి వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సు, అలాగే కనిగిరి నుంచి ఖమ్మం వైపు వెళుతున్న మరో ఆర్టీసీ బస్సు వేములపాడు ఘాట్ రోడ్ఢు వద్ద ఢీకొన్నాయి. ఒకేసారి రెండు బస్సులు ఎదురెదురుగా రావటంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో రెండు బస్సుల్లో ఉన్న ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి. గాయపడిన వారిని సమీప ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.