ఏడుపాయల దేవాలయంలో హుండీ దొంగతనం - సీసీటీవీ కెమెరాలో రికార్డయిన చోరీ - HUNDIS STOLEN IN EDUPAYALA TEMPLE - HUNDIS STOLEN IN EDUPAYALA TEMPLE
Published : Aug 10, 2024, 2:02 PM IST
Thieves Looted Hundis in Edupayala Temple : మెదక్ జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గభవాని ఆలయంలో చోరీ జరిగింది. గర్భగుడి ముందు మండపంలో ఉన్న రెండు హుండీలను గుర్తుతెలియని ఇద్దరు దుండగులు ఎత్తుకెళ్లారు. హుండీలను చోరి చేసి ఆలయ ఆవరణలో ఉన్న పాత కల్యాణ కట్ట వద్ద ధ్వంసం చేశారు. అందులో ఉన్న బంగారు, వెండి ఆభరణాలతోపాటు నగదును తీసుకెళ్లారు. ఈ తతంగమంతా మండపంలో ఉన్న సీసీ కెమెరాలో రికార్డయింది.
Thieves Theft Hundi at Edupayala Temple in Medak : ఆలయ నిర్వాహకుల ఫిర్యాదుతో పాపన్నపేట పోలీసులు అక్కడికి చేరుకుని ఆధారాలు సేకరించారు. చోరీకి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. రెండు హుండీలలో కలిపి సుమారుగా రూ. 20,000 వరకు నగదు ఉంటుందని ఆలయ ఈవో, ఛైర్మన్ అంచనా వేశారు. గతంలో కూడా గర్భగుడిలో ఉన్న కిటికీని ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లారని, ఇలాంటివి పునరావృతం కాకుండా పటిష్ఠమైన భద్రత ఏర్పాటు చేయాలని భక్తులు కోరారు.