YUVA : ఫెలోషిప్ డబ్బుతో కుటుంబ పోషణ - కోచింగ్ లేకుండానే అయిదు ప్రభుత్వ కొలువులు - Young man Got Five Government Jobs - YOUNG MAN GOT FIVE GOVERNMENT JOBS
Published : Sep 23, 2024, 6:37 PM IST
Tukaram Rathore Success Story : కోచింగ్కు వెళ్లే స్థోమత లేదని ఉద్యోగసాధన మానేస్తుంటారు కొందరు యువత. ఆర్థిక కష్టాలకు తలొంచి ఏదోక ఉద్యోగంలో చేరిపోతుంటారు. మారుమూలా తండాలో పుట్టిన ఈ యువకుడిదీ అదే దుస్థితి. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే కల సాకారం చేసుకునే వరకూ పట్టు వదల్లేదు. ఏకంగా అయిదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఔరా అనిపించాడు సంగారెడ్డి జిల్లా మల్చెల్మ తండాకు చెందిన తుకారాం రాథోడ్. చదువుకుంటూనే ఫెలోషిప్ డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొస్తూ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. కోచింగ్ తీసుకోకుండానే దీర్ఘకాల సాధనతో సర్కారు కొలువులు దక్కించుకున్నాడు. జేఎల్, డీఎల్, గ్రూప్-4, పేటెంట్ ఆఫీసర్గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, జెన్కోలో కెమిస్ట్ తదితర కొలువులు సాధించాడు. ఇందులో పేటెంట్ ఆఫీసర్ జాబ్ ఎంచుకుంటానని చెబుతున్నాడు. తన ప్రయత్నం మానడం లేదని, ఉద్యోగం చేస్తూ సివిల్స్ రాసి ఐఏఎస్ సాధించడమే తన లక్ష్యమని పేర్కొంటున్నాడు. ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే యువకులు విజయం సాధించేవరకు ప్రయత్నాన్ని విరమించకూడదని చెబుతున్నాడు తుకారాం రాథోడ్.