తెలంగాణ

telangana

ETV Bharat / videos

మేడారం ప్రయాణికుల సౌకర్యార్థం టీఎస్​ఆర్టీసీ బేస్ క్యాంప్స్ : ఎండీ సజ్జనార్ - Medaram Jatara 2024 Arrangements

By ETV Bharat Telangana Team

Published : Feb 11, 2024, 5:00 PM IST

TSRTC MD Sajjanar Interview : సమ్మక్క-సారలమ్మ జాతరకు టీఎస్‌ఆర్టీసీ 6,000 ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది. అంతే కాకుండా అక్కడ ప్రత్యేకంగా బేస్ క్యాంప్‌లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తోంది. మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఉచిత ప్రయాణాన్ని ప్రత్యేక బస్సుల్లోనూ అమలు చేస్తున్నామని సంస్థ ప్రకటించింది. ఏసీ బస్సుల్లో మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేసింది. సమ్మక్క- సారలమ్మ దర్శనానికి వెళ్లే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లు చేశామని టీఎస్​ఆర్టీసీ ఎండీ(TSRTC MD) సజ్జనార్‌ తెలిపారు. 

Medaram Jatara 2024 Arrangements : గత జాతర కరోనా సమయంలో జరిగిందని సజ్జనార్‌ గుర్తు చేశారు. 2022లో జరిగిన ఈ జాతరకు 20 లక్షల భక్తులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని పేర్కొన్నారు. దీనికి అనుగుణంగా ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నామని, అందుకు తగినట్టే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రైవేట్‌ వాహనాలకు పార్కింగ్‌ సదుపాయాన్ని సమకూర్చామని చెప్పారు. ఈ ఏర్పాట్లు చేసేందుకు అధిక సమయం దొరికిందని అన్నారు. ఈ జాతరకు టీఎస్‌ఆర్టీసీ సంస్థ చేసిన ఏర్పాట్లను సజ్జనార్‌ ఇంటర్వూ ద్వారా తెలుసుకుందాం. 

ABOUT THE AUTHOR

...view details