తెలంగాణ

telangana

ETV Bharat / videos

వరుణ్ సందేశ్​కు ANR అవార్డ్- 'ఆ విషయంలో అక్కినేనిది కీలక పాత్ర' - ANR Award - ANR AWARD

By ETV Bharat Telugu Team

Published : Jun 7, 2024, 5:29 PM IST

ANR Award Varun Sandesh: దివంగత అక్కినేని నాగేశ్వరరావు సినీ అరంగేట్రం చేసి 80 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్​లో ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 'అక్కినేని యువ పురస్కారం' పేరిట అవార్డులు ఇచ్చారు. ఈవెంట్​కు హాజరైన సీనియర్ నటులు మురళీమోహన్ అక్కినేని లాంటి మహా నటుల పేరుతో ఇచ్చే పురస్కారాలు యువ నటీనటుల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయని అన్నారు. ఇక ఈ పురస్కారనికి యంగ్ హీరో వరుణ్ సందేశ్​ను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలో వరుణ్​కు మురళీమోహన్ అక్కినేని పురస్కారాన్ని ప్రదానం చేసి అభినందించారు.

'హ్యాపీడేస్, కొత్తబంగారు లోకం చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న వరుణ్ సందేశ్ పెద్దల పట్ల ఎంతో వినయంగా ఉంటాడు. ఆ మహానటుడి అవార్డును వరుణ్ లాంటి యువనటులకు ఇవ్వడం సముచిత నిర్ణయమే' అని మురళీమోహన్ అన్నారు. చలన చిత్ర పరిశ్రమను మద్రాసు నుంచి హైదరాబాద్​కు తీసుకురావడంలో ఏఎన్​ఆర్ కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు. ఇక ఈ కార్యకమంలో సీనియర్ దర్శకుడు రేలంగి నరసింహారావు, ప్రముఖ రచయిత్రి డాక్టర్ కేవి కృష్ణకుమారి, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ తదితరులు హాజరయ్యారు.

ABOUT THE AUTHOR

...view details