LIVE : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలు - కల్పవృక్ష వాహనంపై శ్రీనివాసుడు - Tirumala Srivari Brahmotsavam Live - TIRUMALA SRIVARI BRAHMOTSAVAM LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2024, 7:58 AM IST
|Updated : Oct 7, 2024, 8:31 AM IST
Tirumala KalpaVruksha Vahana Seva Live : గోవిందనామ స్మరణతో సప్తగిరులు మార్మోగుతున్నాయి. భక్తులతో తిరుమల కిటకిటలాడుతోంది. శ్రీవేంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సాయంత్రం స్వామివారు కల్పవృక్ష వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తున్నారు. మలయప్పస్వామి ఆ వాహనంపై ఊరేగుతూ భక్తులకు అభయప్రదానం చేస్తున్నారు. వాహన సేవను తిలకించేందుకు భారీగా భక్తులు తరలివచ్చారు. స్వామివారి వైభోగాన్ని కనులారా వీక్షిస్తున్నారు. మాడ వీధుల్లో కల్పవృక్ష వాహనం ముందు భక్తజన బృందాలు చెక్కభజనలు, మంగళ వాయిద్యాల నడుమ, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా వాహనసేవ వైభవంగా జరుగుతోంది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకుంటున్నారు. స్వామి వారికి సాయంత్రం ఊంజల్ సేవ జరగనుంది. రాత్రి సర్వభూపాల వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. మరోవైపు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
Last Updated : Oct 7, 2024, 8:31 AM IST