హోలీ రోజు చెరువులో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు - Three Youth Missing in pond on Holi - THREE YOUTH MISSING IN POND ON HOLI
Published : Mar 26, 2024, 4:40 PM IST
Three Youth Missing in pond on Holi : హోలీ సంబరాల్లో పటాన్‌చెరు నియోజకవర్గంలో రెండు చోట్ల అపశృతి చోటుచేసుకుంది. హోలీ ఆడిన అనంతరం చెరువులో స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ఇంద్రేశంకి చెందిన పదిమంది యువకులు సోమవారం రోజున హోలీ సంబరాలు జరుపుకున్న తర్వాత, గ్రామ శివారులోని చెరువులోకి స్నానానికి వెళ్లారు. ఈ క్రమంలో చెరువులోని పుట్టిని ఎక్కిన శివ అనే యువకుడు అది గాలివాలుకు నీటిలో మునగడంతో ఈత రాదంటూ స్నేహితులకు వినిపించేలా ఆరిచాడు.
Three Young Man Missing in pond : అరుపులు గమనించిన రాజేశ్, శివను రక్షించే క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో గల్లంతయ్యాడు. శివను ఒడ్డుకు చేర్చిన స్నేహితులు రాజేశ్‌ను రక్షించలేకపోయారు. మరోవైపు గుమ్మడిదల మండలం వీరన్న గూడెం చెరువులో కూడా ఇద్దరు యువకులు హోలీ సంబరాల అనంతరం స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, ముగ్గరు యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు.