LIVE VIDEO : పట్టీలు కొంటామని వచ్చి - నైస్‌గా కొట్టేసి వెళ్లిపోయారు - Women Chori In Adilabad - WOMEN CHORI IN ADILABAD
Published : Jun 23, 2024, 1:19 PM IST
Three Women Stole Silver Anklets in Adilabad : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ నగల దుకాణంలో ముగ్గురు మహిళలు వెండి పట్టీలను చాకచక్యంగా చోరీ చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శ్రీ గణేశ్ నగల దుకాణానికి ముగ్గురు మహిళలు వచ్చారు. అందులో ఒక మహిళ వెండి కాళ్ల పట్టీలు చూపించమని అడిగింది. షాపు యజమాని పట్టీలు చూయించాడు. ఈ క్రమంలో ఇద్దరు మహిళలు పట్టీలు చూస్తున్నట్లు చేశారు. అందులో ఒక మహిళ ఎలాంటి అనుమానం రాకుండా వాటిని కింద పడేసింది. మరో మహిళ వెంటనే వాటిని చీరలో దాచుకుంది.
తర్వాత అక్కడ ఏం నచ్చలేవని, మరో దుకాణానికి వెళ్తామని అక్కడి నుంచి వచ్చేశారు. యజమాని వాటిని తిరిగి లోపల పెట్టేటప్పుడు పట్టీలు తక్కువ ఉన్నాయని గమనించి అపహరణకు గురయ్యాయని గుర్తించాడు. దీంతో యజమాని కాటోజి వంశీ కృషి వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కాగా మహిళల చోరీ తతంగమంతా సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. చోరీ చేసిన వెండి పట్టీల విలువ రూ.60 వేల వరకు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు.