తెలంగాణ

telangana

ETV Bharat / videos

భర్తను వదిలేసి భార్య, కుమార్తె, కుమారుడిను కిడ్నాప్​ చేసిన దొంగలు - ట్విస్ట్​ తెలుస్తే అదుర్స్​! - Thieves stole idols in JubileeHills - THIEVES STOLE IDOLS IN JUBILEEHILLS

By ETV Bharat Telangana Team

Published : May 19, 2024, 7:54 PM IST

Thieves Stole Idols in Jubilee Hills : హైదరాబాద్​లోని ఓ కుటుంబం కిడ్నాప్​నకు గురైంది. దీంతో నగరవ్యాప్తంగా ఈ ఘటన​ గురించే చర్చించుకుంటున్నారు. అసలు హైదరాబాద్​ ప్రాంతంలో కుటుంబం కిడ్నాప్​కు గురవడం ఏంటి? భర్తను వదిలేసి భార్యను కుమార్తెను, కుమారుడిని తీసుకెళ్లడం ఏంటి? అసలు ఏం జరుగుతుంది హైదరాబాద్​లో అనుకుంటున్నారా? ఇంతకీ ఆ ఫ్యామిలీ ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే హైదరాబాద్​లోని జూబ్లీహిల్స్​ నర్నే కూడలి వద్దకు వెళ్లాల్సిందే. అక్కడ ఏర్పాటు చేసిన ఓ కుటుంబంతో కూడిన చిన్న ఫ్యామిలీ విగ్రహాలను జీహెచ్​ఎంసీ ఏర్పాటు చేసింది. 

ఈ విగ్రహాలను 2021లో జీహెచ్​ఎంసీ పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసింది. ఇప్పుడా విగ్రహాలు దొంగతనానికి గురయ్యాయి. తండ్రి విగ్రహాన్ని మాత్రమే వదిలేసి భార్య, కుమార్తె, కుమారుడు విగ్రహాలను దొంగలించారు. సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన విగ్రహాలను కూడా దొంగలు వదిలిపెట్టకపోవడంతో నగరవాసులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదు. కానీ ట్విటర్​ వేదికగా మాత్రం హైదరాబాద్​ పోలీసులను ట్యాగ్​ చేస్తూ విగ్రహాలు మిస్సింగ్​ అయ్యాయని, కనిపెట్టాలని పోస్టులు పెడుతున్నారు. ఇప్పుడు అర్థమైందా పోయింది విగ్రహాల ఫ్యామిలీ అని.

ABOUT THE AUTHOR

...view details